మా పిచ్ లపై ఏడుస్తారెందుకు ? విమర్శకులకు గంభీర్ కౌంటర్

భారత్ గడ్డపై ఎప్పుడు టెస్ట్ సిరీస్ లు జరిగినా పిచ్ లపైనే ప్రధానంగా చర్చ ఉంటుంది. ఏ జట్టు ఇక్కడకు వచ్చినా స్పిన్ పిచ్ లు...మూడు రోజుల్లోనే ముగుస్తాయంటూ కొందరు ఓవరాక్షన్ చేస్తుంటారు. ఇలాంటి కామెంట్స్ కు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - September 18, 2024 / 02:06 PM IST

భారత్ గడ్డపై ఎప్పుడు టెస్ట్ సిరీస్ లు జరిగినా పిచ్ లపైనే ప్రధానంగా చర్చ ఉంటుంది. ఏ జట్టు ఇక్కడకు వచ్చినా స్పిన్ పిచ్ లు…మూడు రోజుల్లోనే ముగుస్తాయంటూ కొందరు ఓవరాక్షన్ చేస్తుంటారు. ఇలాంటి కామెంట్స్ కు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. భారత్ పిచ్ లపై పడి ఏడుస్తారెందుకని ప్రశ్నించాడు. ఇక్కడి పిచ్ లపై ఎందుకు ఎక్కువగా చర్చిస్తారో అర్థం కావడం లేదన్నాడు. తాము సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ లు ముగుస్తాయని గుర్తు చేశాడు. అప్పుడు ఎవ్వరూ నోరు మెదపరెందుకని సూటిగా ప్రశ్నించాడు. ఎవ్వరు ఎక్కడ ఆడినా పరిస్థితులకు అలవాటు పడాల్సిందేనని వ్యాఖ్యానించాడు.

భారత్ కు వచ్చే ఏ జట్టయినా స్పిన్నర్లను ఆడడం నేర్చుకోవాలని సూచించాడు. దీనిని సాకుగా చూపి అనవసరంగా చర్చించొద్దని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా సీనియర్ ప్లేయర్స్ అందరితో తనకు మంచి రిలేషన్ ఉందని గౌతీ క్లారిటీ ఇచ్చాడు. అందరం జట్టు విజయం కోసమే ప్రయత్నిస్తామని, ఎటువంటి ఇగోలకు తావులేదన్నాడు. ఇక తాము ఏ జట్టుకూ భయపడమని గంభీర్ తేల్చేశాడు. అదే సమయంలో ప్రత్యర్థి ఎవరైనా గౌరవిస్తామని చెప్పాడు. బంగ్లాదేశ్ నే కాదు ఏ జట్టునూ తేలిగ్గా తీసుకునే అలవాటు లేదన్న గంభీర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ప్రతీ సిరీస్ కీలకమేనని గుర్తు చేశాడు.