Bhagavad Gita: ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం.. చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

హిందువులు అధికంగా ఉన్న మన దేశంలో ప్రజాప్రతినిధులు భగవద్గీతపై ప్రమాణం చేయడ సహజమే. కానీ, ఆస్ట్రేలియన్‌ పార్లమెంటులో ఇలా భగవద్గీతపై ప్రమాణం చేయడం మాత్రం చాలా ప్రత్యేకం. భారతీయ సంతతికి చెందిన సెనెటర్‌ (ఎంపీ) ఈ చారిత్రక ఘట్టానికి కారణమయ్యారు.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 09:37 PM IST

Bhagavad Gita: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతకు అంతర్జాతీయంగా గౌరవం దక్కింది. అది కూడా ఆస్ట్రేలియా పార్లమెంటు సాక్షిగా. ఈ చారిత్రక ఘట్టానికి వేదికైంది ఫిబ్రవరి 7. భారత సంతతికి చెందిన బారిస్టర్‌ వరుణ్‌ ఘోష్‌ అనే సెనేటర్.. ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేశారు. కోర్టుల్లో భగవద్గీతపైనే ప్రమాణం చేస్తారనే సంగతి తెలిసిందే. హిందువులు అధికంగా ఉన్న మన దేశంలో ప్రజాప్రతినిధులు భగవద్గీతపై ప్రమాణం చేయడ సహజమే.

TDP-BJP: టీడీపీతో బీజేపీ పొత్తుల చర్చలు.. జగన్‌కు ఓటమి భయం మొదలైందా..?

కానీ, ఆస్ట్రేలియన్‌ పార్లమెంటులో ఇలా భగవద్గీతపై ప్రమాణం చేయడం మాత్రం చాలా ప్రత్యేకం. భారతీయ సంతతికి చెందిన సెనెటర్‌ (ఎంపీ) ఈ చారిత్రక ఘట్టానికి కారణమయ్యారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు. ప్రమాణం అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ కూడా వరుణ్‌ ఘోష్‌కు స్వాగతం పలికారు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో నివాసం ఉంటున్న వరుణ్‌ ఘోష్‌ లాయర్. 997లో భారత దేశం నుంచి స్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్లిన న్యూరాలజిస్టు తల్లిదండ్రుల కుమారుడు వరుణ్. అతడు అక్కడే ఆర్ట్స్‌ అండ్‌ లాలో పట్టా పొందాడు. గతంలో న్యూయార్క్‌లో ఫైనాన్స్‌ అటార్నీగా, వాషింగ్‌టన్‌లోని ప్రపంచ బ్యాంకు సలహాదారుగా పనిచేశాడు. తర్వాత తన రాజకీయ జీవితాన్ని పెర్త్‌లోని లేబర్‌ పార్టీతో ప్రారంభించాడు.

అనారోగ్యంతో పదవీ విరమణ చేయబోతున్న సెనెటర్‌ పాట్రిక్‌ డాడ్సన్‌ స్థానంలో వరుణ్‌ ఘోష్‌ సెనెటర్‌గా ఎంపికయ్యారు. లేబర్‌పార్టీలో చేరికతో ఆయన రాజకీయ జీవితం మొదలయ్యింది. ఫెడరల్‌ పార్లమెంట్‌ సెనేట్‌లో పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడానికి లెజిస్లేటివ్‌ అసెంబ్లీ, లోజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సెనేటర్‌గా వరుణ్‌ ఘోష్‌ను ఎన్నుకున్నాయి.