అలాంటి రైల్వే సరికొత్తగా ప్యాసింజర్ల ప్రయాణం సుఖమయం, సౌకర్యవంతం కావాలని కోరుకుంటూ కొన్ని రూల్స్ ని మార్చనుంది. ఈ మార్పు చేసిన సరికొత్త నియమాలు జూలై 1 నుంచి అమలు కానున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రైల్వే శాఖ కొత్త రూల్స్ ఇవే..
వేక్అప్ కాల్ ఫీచర్..
వీటన్నింటితో పాటూ రైలులో రాత్రి పూట ప్రయాణం చేసేవారు హెచ్చరిక లేకుండా నిద్రిస్తూ ఉంటారు. దీనికి కారణం తెల్లవారు జామున మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు సదరు ప్రయాణీకుడి డెస్టినేషన్ స్టేషన్ రావడం. దీంతో వారు మెలుకువరాక తాము దిగాల్సిన రైల్వే స్టేషన్ ను దాటవేయాల్సి వస్తుంది. ఇలా జరగడం వల్ల వారు చేరవల్సిన గమ్యస్థానాన్ని కాకుండా మరో గమ్యస్థానాన్ని చేరుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో టికెట్ కలెక్టర్ మనల్ని చూస్తే తిరిగి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఆ పరిస్థితులు తలెత్తకుండా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది రైల్వే. గమ్యస్థానానికి చేరుకునే ముందే రైల్వే సదరు ప్రయాణికుడిని మేలుకునేలా చేస్తుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. 139కి కాల్ చేసి భాషను ఎంచుకుని, ఆపై 7 నంబర్ ను ప్రెస్ చేయండి. ఆ తరువాత మీ టికెట్ లోని పది అంకెల పీఎన్ఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వేకప్ కాల్-డెస్టినేషన్ అలర్ట్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల రాత్రి వేళల్లో మన గమ్యస్థాన స్టేషన్‌కు చేరుకునేలోపు రైల్వే వేక్అప్ కాల్- డెస్టినేషన్ అలర్ట్ ఇస్తుంది. అంటే మొబైల్ లో అలారం మ్రోగుతుందనమాట.
ఈ అలర్ట్ ని ఎస్ఎంఎస్ ద్వారా కూడా యాక్టివ్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయడానికి. మీ మొబైల్ లో మెసెస్ బాక్స్ ఓపెన్ చేసి అలర్ట్ అని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి టికెట్ లోని పది అంకెల పీఎన్ఆర్ నంబర్‌ని నమోదు చేయాలి. దానిని 139కి పంపించాలి. మన సమాచారాన్ని స్వీకరించినట్లు ఒక మెసేజ్ పంపిస్తుంది రైల్వే. దీంతో వేకప్ అలర్ట్ యాక్టివేట్ అయి మన ఊరికి సమీపంలో ఫోన్లో రింగ్ అవుతుంది. దీనిని మనం లేచి ఆఫ్ చేసే వరకూ మ్రోగుతూనే ఉంటుంది. ఇలా ప్రతి ప్రయాణీకుడు తన గమ్యస్థానాన్ని సులువుగా చేరుకోవచ్చు.
T.V.SRIKAR