భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ శాంతకుమారి అధికారులతో రివ్యూ చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఫూల్ ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. కాగా ఉపరాష్ట్రపతి తొలిసారిగా రాష్ట్రంలో పర్యటిస్తుడడంతో పోలీసు బందోబస్తుతో పాటు పోలీసు బ్యాండ్‌ను ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయాలని సీఎస్ తెలిపారు. ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ఎంసీ, ఇంధనశాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఆరోగ్యశాఖ కమిషనర్ క్రిస్టినా, ఆర్‌అండ్‌బీ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.