Hattrick PM, Narendra Modi : ఇండియా హ్యాట్రిక్ పీఎం మోడీ.. ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలు

భారత దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు (General Elections).. లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఎన్డీఏ (NDA) కూటమితో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడగట్టుకొని ప్రధానిగా నరేంద్ర మోదీ (Narendra Modi) ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎట్టకేలకు దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఇక ప్రధాని పగ్గాలు చేపట్టడం మిగిలింది. ఏ పార్టీ అని అనుకుంటున్నారా..? భారత దేశ హాట్రిక్ ప్రధానిగా తిరిగి మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని పగ్గాలు చేపటనున్నారు.

ఇక విషయంలోకి వెళితే..

భారత దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు (General Elections).. లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఎన్డీఏ (NDA) కూటమితో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడగట్టుకొని ప్రధానిగా నరేంద్ర మోదీ (Narendra Modi) ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో దేశ చరిత్రలో వరుసగా మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టానికి భారత మిత్ర దేశాలకు ఆహ్వానం అందినట్లు సమాచారం..

జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం..

ఈ నెల జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార మహోత్సవం ఉండనుంది. మోదీ ప్రమాణస్వీకార మహోత్సవానికి పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు భారత నూతన ప్రభుత్వం నుంచి ఆహ్వానం.. కాగా మోదీ ఇప్పటికే నేపాల్ పీఎం ప్రచండ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక ప్రెసిడెంట్ విక్రమసింఘేను సంప్రదించారు. నేడు సంబంధిత దేశాల నేతలు అందరికీ అధికారికంగా ఆహ్వానం పంపించొచ్చని సమాచారం.

జూన్ 9న కేంద్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం..

భారత దేశ మూడో ప్రధానిగా నరేంద్ మోదీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. మరుసటి రోజు.. జూన్ 9న కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొత్త మంత్రివర్గంతో ప్రమాణం చేయించనున్నారు. బీజేపీతో పాటు ఎన్డీయే కూటమిలోని పలు పార్టీల ఎంపీలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.