మొయినాబాద్ లోని కనకమామిడిలో నిర్మిస్తున్న నూతన ఇండోర్ స్టేడియం స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెలితే.. మొయినాబాద్ లో ప్రభుత్వం నూతన టెక్నాలజీతో ఇండోర్ స్టేడియంను నిర్మిస్తుంది. ఒకే పిల్లర్ పై కొత్త టెక్నాలజీతో స్టేడియం నిర్మాణం చేసేందుకు కాంట్రాక్టర్ ప్రయత్నం చేశారు. కానీ నిర్మాణం జరుగుతున్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అని సమాచారం. దీని నిర్మాణంలో స్లాబ్ వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ స్లాబ్ కూలిన సమయంలో అక్కడ దాదాపు 20 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇక స్లాబ్ కూలుతుందని గ్రహించిన కొందరు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. మరి కొందరు అలర్ట్ అయ్యి పారిపోయే లోపే వారిపై స్లాబ్ పడిపోయింది. స్లాబ్ ఈ సంఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకు అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.