BRS Indrakaran Reddy : బీఆర్ఎస్ పార్టీకి మారో మాజీ మంత్రి గుడ్ బాయ్.. కాంగ్రెస్ లో చేరనున్న ఇంద్రకరణ్ రెడ్డి

ఇప్పటికే నేతల వలసలతో కుంగిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ (BRS Party) కు రాజీనామ చేసే దిశగా అడుగులు.. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి సైతం బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సమాచారం.

 

ఇప్పటికే నేతల వలసలతో కుంగిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ (BRS Party) కు రాజీనామ చేసే దిశగా అడుగులు.. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి సైతం బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సమాచారం. నిన్న ఆయన కే.కేశవరావుతో భేటీ అయ్యారు. ఈనెల 30న ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy)తో పాటు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి (Gaddam Arvind Reddy) సైతం కారు దిగి హస్తం గూటికి చేరుతారని సమాచారం..

గతంలో కూడా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డితో సమావేశం జరిపారు.
కాంగ్రెస్ (Congress) లో చేరికపై వీరిద్దరూ చర్చలు జరిపినట్లు అప్పట్లో తెగ చర్చ జరిగింది. దీంతో ఆయన హస్తం గూటికి చేరడం పక్కా అని ప్రచారం జరుగుతోంది.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కుదిరినప్పటి నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) బీఎస్పీ కి రాజీనామా చేయడం.. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం.. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ (KCR) ప్రకటించడం అన్ని చకచక జరిగిపోయాయి. బీఆర్ఎస్ పార్టీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఎట్టికేలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు కీలక నేతలు మాజీ సీఎం కేసీఆర్ కు ఒకే రోజు బిగ్ షాక్ ఇచ్చారు.

SURESH.SSM