అతి చేస్తే ఇలాగే ఉంటాది, వికెట్ సెలబ్రేషన్ తో గాయం

మైదానంలో బ్యాటర్లే కాదు, బౌలర్లు, ఫీల్డర్లు తమ ఆనందాన్ని వినూత్నంగా చూపిస్తున్నారు. ముఖ్యంగా బౌలర్లు వికెట్ తీసిన ఆనందంలో వాళ్ళు చేసే హడావుడి మాములుగా ఉండట్లేదు.

  • Written By:
  • Publish Date - December 3, 2024 / 09:29 PM IST

మైదానంలో బ్యాటర్లే కాదు, బౌలర్లు, ఫీల్డర్లు తమ ఆనందాన్ని వినూత్నంగా చూపిస్తున్నారు. ముఖ్యంగా బౌలర్లు వికెట్ తీసిన ఆనందంలో వాళ్ళు చేసే హడావుడి మాములుగా ఉండట్లేదు.అండర్ 19 ఆసియా కప్ లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో షూతో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా తన ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. తన అత్యుత్సాహంతో గాయపడ్డాడు. ఆసియాకప్ లో భాగంగా నేపాల్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బౌలర్ కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వికెట్ తీసిన ఆనందంలో నేపాలీ బౌలర్ యువరాజ్ ఖత్రీ ప్రత్యేకంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నిజానికి యువరాజ్ వరుసగా 2 వికెట్లు తీశాడు. యువరాజ్ బౌలింగ్ లో బ్యాటర్ స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బ్యాట్స్‌మన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఆనందంలో యువరాజ్ తన షూను ఫోన్‌గా మార్చుకుని సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత ఎల్‌బీడబ్ల్యూ రూపంలో రెండో వికెట్‌ను అందుకున్నాడు.

ఈ వికెట్ లభించిన తర్వాత యువరాజ్ సహనం కోల్పోయి మైదానంలో చక్కర్లు కొట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతని షూ వదులై రైట్ లెగ్ స్లిప్ కావడంతో కాలు బెణికింది. దీంతో సహాయక సిబ్బంది అతడిని భుజాలపై మోస్తూ పెవిలియన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూఏఈలో జరుగుతున్న అండర్19 ఆసియాకప్ లో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి అనేక చిన్న జట్లు కూడా పాల్గొంటున్నాయి. దీంతో అండర్ 19 ఆసియా కప్ ఉత్కంఠగా మారుతోంది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ 4 వికెట్లు తీసినప్పటకీ…. అతని గాయం నేపాల్ క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేసింది. కాగా ఈ మ్యాచ్ లో నేపాల్ 141 పరుగులు చేసింది. ఛేజింగ్ లో బంగ్లాదేశ్‌ 28.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ును అందుకుంది.