Instagram New Feature: ఇన్‌స్టాలో కొత్త ఫీచర్.. ఇకపై ఇన్‌స్టాలో న్యూడ్ ఫొటోలు పంపితే..

కొత్త ఫీచర్ ద్వారా ఎవరైనా.. ఎవరికైనా డైరెక్ట్ మెసేజ్ (డీఎం) ద్వారా నగ్న చిత్రాలు పంపితే.. అవి ఆటోమేటిగ్గా బ్లర్ అవుతాయి. దీంతో ఇకపై న్యూడ్ ఫొటోలు పంపడం కుదరదు. ఈ ఫీచర్ ప్రధానంగా టీనేజర్లు లక్ష్యంగా రూపొందుతోంది.

  • Written By:
  • Publish Date - April 12, 2024 / 04:51 PM IST

Instagram New Feature: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల లైంగికపరమైన వేధింపులు ఎక్కువైన సగతి తెలిసిందే. కొందరు ఆకతాయిలు.. మహిళలు, యువతులకు నగ్న ఫొటోలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే, ఇలాంటివాటికి చెక్ పెట్టేలా కొత్త టూల్ తీసుకొస్తోంది ఇన్‌స్టాగ్రామ్. ఈ విషయాన్ని ఇన్‌స్టా ప్రకటించింది. లైంగిక దోపిడీపై పోరాటానికి, యువత రక్షణ కోసం తాము కొత్త టూల్‌ తీసుకొస్తున్నామని వెల్లడించింది.

UPPAL MATCH TICKETS: ఉప్పల్ మ్యాచ్‌కు టిక్కెట్లేవి.. ఆన్‌లైన్‌‌లో నిమిషంలోనే సోల్డవుట్.. లెక్క చెప్పని ఎస్సారెచ్..

కొత్త ఫీచర్ ద్వారా ఎవరైనా.. ఎవరికైనా డైరెక్ట్ మెసేజ్ (డీఎం) ద్వారా నగ్న చిత్రాలు పంపితే.. అవి ఆటోమేటిగ్గా బ్లర్ అవుతాయి. దీంతో ఇకపై న్యూడ్ ఫొటోలు పంపడం కుదరదు. ఈ ఫీచర్ ప్రధానంగా టీనేజర్లు లక్ష్యంగా రూపొందుతోంది. 18 ఏళ్లలోపు ఉన్న వారి అకౌంట్లలో ఇది డిఫాల్ట్‌గా ఆన్​ అవుతుంది. అయితే, అంతకుమించిన వయసు వాళ్లు మాత్రం ప్రత్యేకంగా ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా అందుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పింది. ఈ ఫీచర్ మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే పని చేస్తుంది. ఫేస్​బుక్​, వాట్సాప్​లలో మాత్రం ప్రస్తుతం ఈ ఫొటోస్​ బ్లర్​ ఫీచర్​ లేదు. ఈ ఫీచర్ ద్వారా న్యూడ్ ఫొటోలు బ్లర్ అవ్వడమే కాకుండా.. వాటిని పంపిన వారికి వార్నింగ్ మెసేజ్ కూడా పంపిస్తుంది. వారి పొరపాటును గుర్తించి.. అవతలివాళ్లు చూసేలోపే మెసేజ్‌ను డిలీట్ చేసే ఫీచర్ కూడా రానుంది.

అంటే.. ఆ మెసేజ్‌ను డిలీట్ లేదా అన్‌సెండ్ చేయొచ్చు. ఒకవేళ మెసేజ్ అందుకున్న వాళ్లు వాటిని చూస్తే వెంటనే పంపిన వారిని బ్లాక్ చేయొచ్చు. సైబర్ నేరగాళ్లు, కొన్ని సందర్భాల్లో ఇతరులు కూడా న్యూడ్ ఫొటోలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. అయితే, కొత్త ఫీచర్ వల్ల ఇలాంటి వేధింపులు కొంతవరకైనా తగ్గుతాయని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది.