Intermittent Fasting Heart Disease: ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ డేంజర్ ! 91శాతం గుండె పోటుకు అవకాశం !!

ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ వల్ల రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయి లాంటి అనేక కార్డియోమెటబాలిక్ ఆరోగ్య చర్యలు మెరుగవుతాయని గతంలో వచ్చిన స్టడీస్ తెలిపాయి. కానీ లేటెస్ట్ స్టడీస్ మాత్రం.. ఇది పాటించడం వల్ల 91 శాతం గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని చెబుతున్నాయి.

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 03:35 PM IST

Intermittent Fasting Heart Disease: ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ ఇది ప్రపంచంలో చాలామంది ఫాలో అవుతున్న కొత్త డైట్ విధానం. రోజులో 8 గంటలు మాత్రమే ఆహారం తీసుకుంటూ మిగతా టైమ్ లో ఉపవాసం పాటించడం. అంటే 16:8 విధానం. ఇలాగైతే ఆరోగ్యంగా ఉంటామన్న టాక్ రావడంతో భారత్ తో పాటు ప్రపంచంలో చాలామంది ఫాలో అవుతున్నారు. ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ వల్ల రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయి లాంటి అనేక కార్డియోమెటబాలిక్ ఆరోగ్య చర్యలు మెరుగవుతాయని గతంలో వచ్చిన స్టడీస్ తెలిపాయి.

BIRYANI ORDERS : ఏంటీ ! బిర్యానీలే తింటున్నారా..?

కానీ లేటెస్ట్ స్టడీస్ మాత్రం.. ఇది పాటించడం వల్ల 91 శాతం గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని చెబుతున్నాయి. బరువు తగ్గాలంటే ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ చేయమని చాలామంది సలహా ఇస్తుంటారు. కొంత టైమ్ లో ఫుడ్ తీసుకొని మిగతా సమయంలో కడుపును ఖాళీగా ఉంచే ఈ విధానం చాలా డేంజర్ అని అమెరికాలో జరుగుతున్న వైద్య సమ్మేళనంలో నిపుణులు తేల్చి చెప్పారు. షికాగోలో జరుగుతున్న అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కు చెందిన ఎడిడెమియాలజీ అండ్ ప్రివెన్షన్ /లైప్ స్టైల్ అండ్ కార్డియోమెటబాలిక్ సైంటిఫిక్ సెషన్స్ 2024లో సమర్పించిన ప్రాథమిక పరిశోధనల్లో ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ మంచిది కాదని తేలింది. 91శాతం గుండె నొప్పు ఇతర హార్ట్ డిసీజెస్ రావడానికి ఈ ఫాస్టింగ్ కారణమవుతోందని చికాగోలో జరిగిన సమ్మేళనంలో వివరించారు. 20 వేల మందిపై జరిపిన స్టడీస్ లో 8 గంటల పాటు ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ తీసుకునే వారిలో గుండె సంబంధిత మరణాల ముప్పు 91శాతం పెరిగినట్టు తేలింది.

2003 నుంచి 2019 వరకూ మరణాల డేటా, సర్వేలోని అంశాలకు సమాధానాలను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు. గుండెజబ్బులు, కేన్సర్ రోగుల్లో ఈ మరణాలు పెరుగుతాయి. ఈ విధానంతో మరణాల ముప్పును ఏ మాత్రం తగ్గించలేదని స్టడీస్ తేల్చాయి. ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ పై వచ్చిన లేటెస్ట్ స్టడీస్ ని కొందరు వైద్య నిపుణులు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతానికి వెల్లడైన అంశాలపై మరింత లోతుగా స్టడీస్ చేయాల్సి ఉందని చెబుతున్నారు.