INTERNET CUT HOUTHIS: ప్రపంచానికి నెట్ ఆగిపోతుందా ? కేబుల్స్ కట్ చేస్తామన్న హౌతీలు

ఇజ్రాయెల్ – హమాస్ యుద్దం చివరకు ప్రపంచానికి ఇంటర్నెట్ లేకుండా చేస్తుందన్న భయం వ్యక్తమవుతోంది.  హమాస్ కు మద్దతుగా ఎర్రసముద్రంలో యెమెన్ కు చెందిన హౌతీ ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు.  ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.  నాలుగు రోజుల క్రితం భారత్ కు చెందిన నౌకపైనా డ్రోన్ తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు.  ఇప్పుడు ఎర్ర సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తామనీ... ప్రపంచ మొత్తానికి నెట్ లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు.  అదే జరిగితే వాల్డ్ పరిస్థితి ఏంటి.... మన దేశానికి ఏమైనా ఇబ్బంది ఉందా?

  • Written By:
  • Updated On - December 26, 2023 / 01:40 PM IST

ఇజ్రాయెల్ – హమాస్ (Isreal-Hamas war) యుద్దం చివరకు ప్రపంచానికి ఇంటర్నెట్ లేకుండా చేస్తుందన్న భయం వ్యక్తమవుతోంది.  హమాస్ కు మద్దతుగా ఎర్రసముద్రంలో యెమెన్ కు (Yeman) చెందిన హౌతీ ఉగ్రవాదులు (Houthis) చెలరేగిపోతున్నారు.  ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.  నాలుగు రోజుల క్రితం భారత్ కు చెందిన నౌకపైనా డ్రోన్ తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు.  ఇప్పుడు ఎర్ర సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తామనీ… ప్రపంచ మొత్తానికి నెట్ లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు.  అదే జరిగితే వాల్డ్ పరిస్థితి ఏంటి…. మన దేశానికి ఏమైనా ఇబ్బంది ఉందా?

హమాస్ పై యుద్ధం నిలిపివేయాలంటూ గత కొంత కాలంగా హౌతీ ఉగ్రవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ ఇస్తుండటాన్ని వీళ్ళు తప్పుబడుతున్నారు. అమెరికా ఆధ్వర్యంలోని అంతర్జాతీయ సైనిక బలగాలు ఎర్రసముద్రంలో మొహరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  దీనిపై ఆగ్రహంగా ఉన్న హౌతీలు ఇంటర్నెట్ వ్యవస్థ మీద దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు.  ఎర్రసముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తామన్నారు.  ప్రస్తుతం బాబ్ అల్ – మందబ్ జలసంధి మీదుగా సముద్ర గర్భ నుంచి ఈ కేబుల్స్ వెళ్తున్నాయి.

అంతర్జాతీయ సైనిక బలగాలను మొహరింపు నిర్ణయానికి ఇటలీ, స్పెయిన్ మద్ధతిస్తే ఊరుకోబోమని హౌతీలు వార్నింగ్ ఇచ్చారు.  తాము కేబుల్స్ కట్ చేస్తే… నెట్ లేక ప్రపంచ దేశాలు మళ్ళీ రాతియుగంలోకి వెళతాయని అంటున్నారు.  హౌతీల వార్నింగ్ పై అరబ్, అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి.  హౌతీలకు చెక్ పెట్టకపోతే… ప్రపంచానికి నెట్ వర్క్ సమస్య ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

BIG BOSS CASE : బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు ఇకపై ర్యాలీలు నిషేధించే ఛాన్స్ !

ఎర్రసముద్రంలో కేబుల్స్ కట్ చేస్తే… భారత్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ఇండియాకు ఒకే కేబుల్ వ్యవస్థ ద్వారా నెట్ రావడం లేదు… దేశంలో వేర్వేరు సంస్థలకు వివిధ దేశాల నుంచి ఫైబర్ కేబుల్ వ్యవస్థ ఉంది.  ఒకటి కాకపోతే… మరోటి ఆల్టర్నేట్ గా వాడుకోడానికి మన దేశంలోని సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశం ఉందంటున్నారు.  ఇండియాకు చెన్నై, పుదుచ్చేరి, కోల్ కతా, ముంబై  లాంటి పోర్టుల దగ్గర ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ హబ్ లు ఉన్నాయి. అయితే ముంబై – హైదరాబాద్ లైన్ లో అంతరాయం ఏర్పడితే… చెన్నై, కోల్ కతా నుంచి సర్వీస్ ప్రొవైడర్లు డేటాను తీసుకునే అవకాశముంది.  అర్జెంటీనా లాంటి దేశాల నుంచి ఎమర్జన్సీ ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందే ఛాన్స్ కూడా మన దేశానికి ఉంది.  అందువల్ల హౌతీ ఉగ్రవాదుల కేబుట్ కట్ బెదిరింపులకు మనం భయపడాల్సిన అవసరం లేదంటుననారు. కానీ కొన్ని దేశాలకు ఇంటర్నెట్ సరఫరా మాత్రం నిలిచిపోయే ఛాన్సుంది