iPhone: ఐఫోన్.. అందుకే టాప్.. 16వేల అడుగుల నుంచి కిందపడ్డా పగలని ఫోన్

16 వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డా ఐఫోన్ పగలలేదు. ఈ ఘటన ఈ నెల 5న జరిగింది. గత శుక్రవారం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం డోర్ ఊడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది.

  • Written By:
  • Publish Date - January 8, 2024 / 06:55 PM IST

iPhone: స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐఫోన్ చేతిలో ఉంటే అదో గౌరవంగా భావిస్తారు. దీనికి కారణం.. ఆ ఫోన్ అందించే ఫీచర్లు, ప్రైవసీ, సెక్యూరీటీ వంటి క్వాలిటీలు నచ్చడమే. తాజాగా ఐఫోన్ క్వాలిటీ ఏంటో సూచించే సంఘటన ఒకటి జరిగింది. 16 వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డా ఐఫోన్ పగలలేదు. ఈ ఘటన ఈ నెల 5న జరిగింది. గత శుక్రవారం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం డోర్ ఊడిపోయిన సంగతి తెలిసిందే.

Mamidala Yashaswini Reddy: చెప్పిందంటే చేస్తుందంతే.. మాట నిలబెట్టుకున్న యశస్విని రెడ్డి..

ఈ ఘటన జరిగిన సమయంలో విమానం దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. అయితే, విమానం డోర్ ఊడిపోవడంతో అందులోని ప్రయాణికులకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ వంటి కొన్ని వస్తువులు కింద పడిపోయాయి. వాటిలో ఒక ఐఫోన్ కూడా ఉంది. దీనిపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, విమానం నుంచి కిందపడిపోయిన ఐఫోన్.. రోడ్డు పక్కన ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి దొరింది. పైనుంచి కింద పడటంతో ఆ వస్తువును సీనాథన్ బేట్స్ అనే వ్యక్తి తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్ని ఫొటోలతో సహా అతడు తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు. తనకు రోడ్డు పక్కన వెళ్తుండగా ఒక ఐఫోన్ దొరికిందని చెప్పాడు. ఆ ఐఫోన్లో సగం బ్యాటరీ ఛార్జింగ్‌తో ఏరోప్లేన్ మోడ్‌లో ఉందని తెలిపాడు. అందులో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన బ్యాగేజ్ క్లెయిమ్ వివరాలు ఉన్నట్లు వివరించాడు. అందులోని వివరాల ప్రకారం.. ఆ ఐఫోన్ ఇటీవల గాల్లో ప్రయాణిస్తున్న అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం డోర్ ఊడిపోయిన ఘటనలో కిందపడిన ఫోన్‌గా గుర్తించారు. ఇక్కడే ఆ విషయం అందరినీ ఆశ్చర్యపడుతోంది.

ఆ ఫోన్ 16 వేల అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. అయినప్పటికీ ఆ ఫోన్ సాధారణంగానే పనిచేస్తున్నట్లు సీనాథన్ తెలిపారు. పైగా ఆ ఐఫోన్‌కు బ్యాక్‌కేస్ ఉండటంతో ఎలాంటి డ్యామేజీ కాలేదన్నారు. ఆ ఫోన్‌ను పరిశీలించిన తర్వాత దాని మోడల్ ఐఫోన్ 14 ప్రో లేదా ఐఫోన్ 15 ప్రో అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అంత ఎత్తు నుంచి కిందపడ్డప్పటికీ ఫోన్ పాడవకుండా ఉండటంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా.. ఐఫోన్ పవరంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు.