Sunrisers Hyderabad: ఇక తగ్గేదే లే.. ప్రత్యర్థులకు సన్ రైజర్స్ కెప్టెన్ వార్నింగ్

కొత్త కెప్టెన్ రాకతో హైదరాబాద్ తలరాత మారుతుందని ఫ్యాన్స్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కమ్మిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన ఆటతో ముందుకు వస్తామంటున్నాడు. తాజా ఎడిషన్‌ను గెలుపుతో మొదలుపెట్టి, శుభారంభంతో ఆరెంజ్‌ ఆర్మీని ఖుషీ చేస్తామని చెబుతున్నాడు.

  • Written By:
  • Updated On - March 21, 2024 / 07:40 PM IST

Sunrisers Hyderabad: ఐపీఎల్ 17వ సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. గత ఏడాది పేలవ ప్రదర్శనను మరిచిపోయేలా కొత్త కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సారథ్యంలో కొత్త సీజన్‌కు సన్నద్ధమైంది. భారీ ధర పెట్టి కమ్మిన్స్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్.. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. కొత్త కెప్టెన్ రాకతో హైదరాబాద్ తలరాత మారుతుందని ఫ్యాన్స్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు.

MS DHONI: థాంక్యూ కెప్టెన్.. ధోనీ ఫ్యాన్స్ ఎమోషనల్

ఈ నేపథ్యంలో కమ్మిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన ఆటతో ముందుకు వస్తామంటున్నాడు. తాజా ఎడిషన్‌ను గెలుపుతో మొదలుపెట్టి, శుభారంభంతో ఆరెంజ్‌ ఆర్మీని ఖుషీ చేస్తామని చెబుతున్నాడు. గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సన్‌రైజర్స్ ఈసారి పలు మార్పులతో బరిలోకి దిగనుంది. కెప్టెన్‌‌తోపాటు కోచ్‌నూ మార్చేసింది. లారా స్థానంలో డానియల్ వెటోరీని హెడ్ కోచ్‌గా నియమించింది. దూకుడైన ఆటతో తాజా సీజన్‌ను ఆరంభించాలని చూస్తున్నామని చెప్పాడు. ఈ సీజన్‌లో తమది అద్భుతమైన జట్టుగా అభివర్ణించాడు.

కొత్త సీజన్‌ కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ ఆరెంజ్‌ ఆర్మీకి కమిన్స్‌ పిలుపునిచ్చాడు. సీనియర్ ప్లేయర్స్, యంగ్ టాలెంట్‌తో జట్టు సమతూకంగా ఉందన్న కమ్మిన్స్.. అభిమానులు మెచ్చేవిధంగా ఆడతామన్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో మార్చి 23న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడబోతోంది.