తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. నిన్న కనిపించిన సీన్ ఇవాళ కనిపించడంలేదు. ఎవరు ఎవరితో ఎప్పుడు పొత్తు పెట్టుకుంటారో ఎవరూ ఊహించలేకపోతున్నారు. మొన్నటి వరకూ బీబీజేపీ అంటనే నిప్పులు చెరిగిన బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు ఆ పార్టీ విషయంలో కాస్త మెత్తబడ్డారు. ఇటు కాంగ్రెస్ కూడా బీజేపీ మినహా అన్ని పార్టీలను కలుపుకుంటూ వెళ్తూ బలాన్ని పెంచుకుంటోంది. దీంతో ఆటోమేటిక్‌గా తెలంగాణలో బీజేపీ వీక్ అవుతోంది. ఇక్కడే ఓ కీలక చర్చ తెరపైకి వచ్చింది. తెలంగాణలో అన్ని పార్టీలు కాంగ్రెస్ వైపు వెళ్తున్న ఇలాంటి సిచ్యువేషన్‌లో.. బీఆర్‌ఎస్‌కు బీజేపీ తోడు కంపల్సరీ అన్నట్టుగా మారింది. బీజేపీకి కూడా తెలంగాణలో పెద్దగా బలం లేకపోవడంతో బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం ఉత్తమం అనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ పొత్తు గనక ఓకే ఐతే కేటీఆర్‌ను సీఎం చేసిన వెంటనే ఈటెల రాజేందర్‌కు డిప్యుటీ సీఎం పదవి ఇచ్చేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. వినేందుకు షాకింగ్‌గా అనిపించినా ఇప్పుడు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇదే. కేటీఆర్ సీఎం అయితే బీఆర్‌ఎస్ రెండుగా చీలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిలో బీఆర్‌ఎస్‌ను కాపాడుకోవడం కూడా కేసీఆర్‌కు చాలా ముఖ్యం. ఈ విషయంలో ఈటెల మాత్రమే ఆయనకు బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నారట. కేసీఆర్ కుటుంబం తరువాత తెలంగాణలో ఆ స్థాయి ప్రజాధరణ ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్. దీంతో ఆయనను కేటీఆర్‌కు తోడుగా ఉంచితేనే కేటీఆర్ సీఎం పదవిలో సేఫ్‌గా ఉంటారని కేసీఆర్ అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చర్చలో ఎంత వరకూ నిజం ఉంది అన్న విషయం పక్కన పెడితే.. ఈటెలను తిరిగి దగ్గర చేసుకునేందుకు బీఆర్‌ఎస్‌లో ప్రతీ ఒక్కరూ రెడీగా ఉన్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.