వైఫల్యం బ్యాటర్లదా.. బౌలర్లదా ? భారత్ ఓటమికి కారణాలివే

తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాభవానికి ఆస్ట్రేలియా దెబ్బకి దెబ్బ కొట్టింది. పింక్ బాల్ టెస్టులో గెలవడమే కాదు సిరీస్ ను కూడా సమం చేసింది.తొలి టెస్ట్‌లో గొప్పగా ఆడిన టీమిండియా రెండో టెస్టులో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ చేతులెత్తేసింది.

  • Written By:
  • Publish Date - December 9, 2024 / 09:35 PM IST

తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాభవానికి ఆస్ట్రేలియా దెబ్బకి దెబ్బ కొట్టింది. పింక్ బాల్ టెస్టులో గెలవడమే కాదు సిరీస్ ను కూడా సమం చేసింది.తొలి టెస్ట్‌లో గొప్పగా ఆడిన టీమిండియా రెండో టెస్టులో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ చేతులెత్తేసింది. పింక్‌బాల్‌పై భారత యువ ఆటగాళ్లకు అనుభవం లేకపోవడం ఒక రీజన్ అయితే…జట్టు ఎంపికలో లోపాలు, సీనియర్ ఆటగాళ్ళ వైఫల్యం వంటివి టీమిండియా ఓటమికి మరిన్ని కారణాలుగా కనిపిస్తున్నాయి. ముందు తుది జట్టు ఎంపికలో
కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి.తొలి టెస్ట్ విజయంలో కీలకపాత్ర పోషించిన యంగ్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది.

అలాగే ఈ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం ప్రధాన కారణమని చెప్పుకోవాలి. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత స్టార్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. తొలి టెస్ట్ సెంచరీ హీరోలు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఈ మ్యాచ్ లో రాణించకపోవడం బాగా దెబ్బతీసింది. ఎప్పటిలానే భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులో నిలబడటమే అయిష్టంగా కనిపించాడు. బ్యాటింగ్ ఆర్డర్ ఎఫెక్ట్ రోహిత్ ఆటతీరుపై పడుందని అర్థమవుతుంది.ఇక పంత్, గిల్, రాహుల్ త్రయం మంచి ఆరంభాలు లభించినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. బౌన్సర్లు ఆడటంలో భారత బ్యాటర్ల ఎప్పుడూ తడబడుతుంటారు. అడిలైడ్‌లోనూ బలహీనత కొంపముంచింది. పింక్ బాల్ అనూహ్యంగా బౌన్స్ అవ్వడంతో భారత బ్యాటర్లు వాటిని ఎదుర్కోవడంలో తడబడ్డారు.దీనిని గొప్ప అవకాశంగా మలుచుకున్న స్టార్క్, కమిన్స్ బోలాండ్ బౌన్సర్లు విసురుతూ భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.

అడిలైట్ టెస్టులో ట్రావిస్ మెరుపు సెంచరీ మ్యాచ్ ను మలుపు తిప్పింది.చేశాడు.అడిలైడ్ పిచ్‌పై అవగాహన ఉండటంతో హెడ్ చెలరేగిపోయాడు.అతనితో పాటు లబుషేన్ రాణించడం ఆ జట్టుకు కలిసొచ్చింది. అందుకే కొన్ని వికెట్లు పడినా కూడా ఆసీస్ భారీ ఆధిక్యాన్ని అందుకుంది. ఇక మన బౌలర్లు కూడా విఫలమవడం కూడా ఓటమికి మరో కారణం. కంగారూలతో పోలిస్తే భారత బౌలింగ్ అటాక్ చాలా బలహీనంగా కనిపించింది. బుమ్రా మినహా ఏ ఒక్కరూ ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేక పోయారు. సిరాజ్ నాలుగు వికెట్లు తీసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవరాల్ గా సీనియర్ బ్యాటర్ల వైఫల్యం, మన పేసర్లు అనుకున్న రీతిలో రాణించకపోవడం టీమిండియా పరాజయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.