ప్రాజెక్ట్ కే మూవీ రెండుభాగాలుగా మారుస్తున్నారనే ప్రచారం మొదలవ్వగానే,అదేం లేదంటూ మరో వాదన కూడా వినపడింది. కట్ చేస్తే నిజంగానే ప్రాజెక్ట్ కే ని రెండు భాగాలుగా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనని నాగ్ అశ్విన్ తన టీం తో డిస్కర్స్ చేశాడట. ఆమాత్రం దానికే ఇది రెండు భాగాలుగా మారబోతోందంటూ ప్రచారం మొదలైంది. అలాని రెండు భాగాలుగా రాదని కూడా చెప్పలేం
ఐతే ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. సినీ పెద్దలు యంగ్ రెబల్ స్టార్ తన కెరీర్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడంటున్నారు. బాహుబలి 1, బాహుబలి2 ఇది హిట్ ఫార్ములా.. బాలీవుడ్ నుంచి కన్నడ కేజీయఫ్ వరకు సీక్వెల్స్ ఐడియా వర్కవుట్ అయ్యింది. పుష్ప 2 కి కూడా అలాంటి నిర్ణయాల వల్లే వస్తోంది.. అంతా బానే ఉంది. కాని ఆల్రెడీ సలార్ సగం చేశాక పార్ట్ 2 కూడా ఉందన్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కే షూటింగ్ సగం కూడా కాకముందే పార్ట్ 2 అంటున్నారు.
ఇలా చేస్తే మంచి కథని విడకొడితే, ఆ కథలోని ఎఫెక్టీవ్ నెస్ పలుచనై, రిజల్టే తేడాకొట్టొచ్చనే మాట వినిపిస్తోంది. లెంథీ కథని రెండు బాగాలు చెప్పడం వరకు ఓకే కాని, పార్ట్ వన్ పార్ట్ 2 అని ఒకే కథని సాగతీస్తే, సినిమా కాస్త సీరియల్ అవుతుందనే కామెంట్స్ పెరిగాయి. మొత్తానికి మూవీ మొదలవ్వటానికి ముందే రెండు భాగాల కథ అనుకుంటే పర్లేదు కాని, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఒకే మూవీని రెండు గా మార్చాలనే నిర్ణయం కరెక్ట్ కాదనే అభిప్రాయం వినపడుతోంది. ప్రభాస్ ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ లాంటి మిస్టేక్స్ చేసి తన మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్నాడు, మళ్లి ఇలాంటి ప్రయోగం అంటే ఎలా అంటున్నారు.