ఐసీసీ బాస్ పదవి ఇక మనదేనా ? రేసులో ముందున్న జైషా

ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే...ఎన్నో దశాబ్దాల కాలంగా ఐసీసీలో మనదే పైచేయిగా నిలుస్తోంది. వరల్డ్ క్రికెట్ లోనే రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు కావడం, తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. శరద్ పవార్, జగన్మోహన్ దాల్మియా వంటి వాళ్ళు ఐసీసీలో చక్రం తిప్పారు.

  • Written By:
  • Publish Date - August 21, 2024 / 12:49 PM IST

ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే…ఎన్నో దశాబ్దాల కాలంగా ఐసీసీలో మనదే పైచేయిగా నిలుస్తోంది. వరల్డ్ క్రికెట్ లోనే రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు కావడం, తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. శరద్ పవార్, జగన్మోహన్ దాల్మియా వంటి వాళ్ళు ఐసీసీలో చక్రం తిప్పారు. తాజాగా మరోసారి అటువంటి అరుదైన అవకాశం బీసీసీఐకే రాబోతోంది. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా ఐసీసీ ఛైర్మన్ పదవిపై కన్నేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పేరుకు బీసీసీఐ కార్యదర్శి అయినా.. భారత క్రికెట్‌ను అంతా తానై నడిపిస్తున్నారు. బీసీసీఐ షాడో ప్రెసిడెంట్‌గా.. బాస్‌గా జైషా చలామణి అవుతున్నారు. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగుస్తుంది. మరోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని అతను నిర్ణయించుకోవడంతో జై షా పోటీ పడుతారనే చర్చ జోరుగా సాగుతుంది. దీనిపై వచ్చే వారం స్పష్టత రానుంది.

ఐసీసీ ఛైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు ఆగష్ట్ 27 చివరి తేదీ కావడంతో అప్పుడే క్లారిటీ వస్తుంది. ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 ఓట్లు ఉండగా.. 9 ఓట్లు వచ్చిన వ్యక్తి గెలుస్తాడు. ఓటు హక్కు ఉన్న చాలా దేశాలు జై షా పట్ల సానుకూలతతో ఉన్నాయి. బీసీసీఐ కార్యదర్శిగా జై షాకు మరో ఏడాది పదవీ కాలం ఉంది. ఆ తర్వాత అతను రూల్స్ ప్రకారం మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలి. ఈ క్రమంలోనే ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టాలని జైషా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎన్నికైతే.. ఈ పదవి చేపట్టిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టిస్తారు.