రష్మిక, శ్రీలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. బైట మాట్లాడకుంది లేదు. ఈ ఇద్దరి మధ్య శత్రుత్వం లేకపోయినా.. ఫ్రొఫెషనల్ ఫైటర్స్‌గా మారిపోయారు.
హీరోయిన్‌ను పలకరించాలంటే ఏ సినిమా చేస్తున్నావని అడుగుతారు. కానీ.. శ్రీ లీలను ఏ హీరోతో చేయడం లేదని అడగాలి. శ్రీలీల సెట్స్‌కు టైంకు వస్తుందిగానీ.. ఏ సెట్‌కు వస్తుందో అంటూ సెటైర్ వేస్తాడు ఓ హీరో. ఇలా అందరూ శ్రీలీల సినిమాల గురించే మాట్లాడుకునేలా.. లెక్కకు మించి మూవీస్ చేస్తోంది. ఇలా స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తూ.. టాప్ ప్లేస్‌కు చేరింది.
ప్రభాస్ కొత్త సినిమాలో కూడా శ్రీలీల పేరు వినిపిస్తోంది. సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్‌తో తీసే సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల పేరు పరిశీలనలో వుందట. ప్రభాస్ పక్కన ఈ కుర్ర హీరోయిన్ సెట్ అవుతుందా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే.. పూజా నటించాల్సిన రెండు సినిమాలను శ్రీలీల కబ్జా చేసేంది. ఈ అమ్మడి జోరును తట్టుకోవాలంటే.. దూకుడు పెంచాలని రష్మిక డిసైడ్ అయి.. రెండు సినిమాలు లైన్ లో పెట్టింది. రష్మిక ఈ మధ్య కాలంలో సినిమాలు ఓకే చేసే పనిలో బిజీ అయిపోయింది. మొన్నటివరకు ఈ అమ్మడి చేతిలో పుష్ప-2 తప్ప మరోటి లేదు. కెరీర్ ఫస్ట్ టైం లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘రెయిన్‌బో’ చేస్తోంది. ఇది ఇంకా పూర్తికాకుండానే.. రాహుల్ రవీంద్రన్ కథకు ఓకె చెప్పిందట. గాయని చిన్మయిని పెళ్లిచేసుకున్న రాహుల్ రవీంద్రన్ చిలసౌతో దర్శకుడిగా మారి తొలి అడుగులోనే సక్సెస్ చూశాడు. అయితే.. రెండో సినిమా మన్మథుడు-2 విమర్శలు కొనితెచ్చుకున్నాడు. మూడో సినిమా కోసం మూడేళ్లు వెయిట్ చేసి లేడీ ఓరియెంటెడ్ మూవీ కథ రాసుకున్నాడు. ముందుగా సమంత పేరు విన్పించినా.. ప్రస్తుతం రష్మిక పేరు బయటకు వచ్చింది.
10 సినిమాల శ్రీలీల.. 5 సినిమాల రష్మిక
శ్రీలీల 10 సినిమాలు చేస్తే.. తనేం తక్కువంటూ.. ఐదు ప్రాజెక్ట్స్ చేస్తోంది రష్మిక పుష్ప-2.. రెండు లేడీ ఓరియెటెండ్ మూవీస్‌తోపాటు.. ధనుష్, శేఖర్‌కమ్మల సినిమాలో రష్మిక ఎంపికైంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీలో కూడా రష్మిక పేరే వినిపిస్తోంది. ఇలా ఐదు సినిమాలతో శ్రీలీలకు గట్టి పోటీ ఇస్తోంది రష్మిక.