షర్మిల పార్టీ తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్.. నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్ లో విలీనం కాబోతుంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ పూర్తయిపోయింది. రెండు నెలలుగా షర్మిల పార్టీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచి పోయాయి. మొన్నటి వరకు పాదయాత్రలతో . రోజువారి ట్వీట్లతో, ఇంటర్వ్యూలతో కెసిఆర్ ను దుమ్మెత్తి పోసిన షర్మిల.. ఇప్పుడు ఒకటి అర ట్వీట్లతో సరిపెట్టేస్తున్నారు. పాదయాత్ర హఠాత్తుగా నిలిపేశారు. సభ లు, సమావేశాలు అసలే లేవు. మూసేసే పార్టీ మీద పెట్టుబడి ఎందుకు అనుకున్నారో ఏమో పార్టీ వ్యవహారాలు పూర్తిగా నిలిపేశారు. రెంట్ కార్లు వెనక్కి ఇచ్చేశారు. మీడియాకు అయితే అసలు అందుబాటులోనే లేరు. షర్మిల అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి అదృశ్యం అయిపోతున్నారు.
ఆమె వెన్నంటే ఉండే భర్త అనిల్ ఎక్కడో రహస్యం మీటింగలు పెడుతున్నారు. ఆమధ్య షర్మిల బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తో మరోసారి సమావేశం అయ్యారు. ఆరు నూరైనా తెలంగాణలోనే తాను పనిచేస్తానని ,ఆంధ్ర వెళ్ళనని తెగేసి చెప్పేశారు. కాంగ్రెస్ లో యాంటీ రేవంత్ గ్యాంగ్ షర్మిలని బాగా ప్రోత్సహించారు. నువ్వు తెలంగాణలోనే ఉండాలని మరి మరి చెప్పారు. షర్మిల లాంటి.. ఫైర్ ఉన్న లీడర్ తెలంగాణ కాంగ్రెస్ లో ఉంటే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టొచ్చని ఈ వర్గం బలంగా నమ్ముతుంది. షర్మిలాను ఏపీకి పంపి అక్కడ పిసిసి అధ్యక్షురాలు చేయాలని రేవంత్ రెడ్డి అధిష్టానానికి సలహా ఇచ్చాడు. తద్వారా భవిష్యత్తులో షర్మిల తనకు తలనొప్పి కాకుండా ఉండాలని భావించాడు.. కానీ ఆ టెక్నిక్ ట పనిచేయలేదు అధిష్టానం షర్మిలాని తెలంగాణకి పరిమితం.. చేయాలని నిర్ణయించుకుంది .ఇప్పటికిప్పుడు ఆంధ్రాలో షర్మిల తో ప్రయోగం చేసినా ఉపయోగం ఉండదని కూడా భావిస్తుంది.
మొత్తం మీద షర్మిల పార్టీ కథ కంచికొచ్చేసింది. కాంగ్రెస్లో విలీనం కావడం ఒక్కటే మిగిలింది.. సొంత పార్టీ అంటూ ఇంత హడావుడి చేసిన షర్మిల చివరికి చేతులెత్తేసింది. ఈ మొత్తం వ్యవహారంలో బాగుపడింది ఎవర్రా అంటే.. ఆమెకు దిక్కుమాలిన సలహాలు ఇచ్చిన మీడియా కన్సల్టెంట్లు, సలహాదారులు మాత్రమే.