Sadhguru: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరిన సద్గురుకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. సద్గురు జగ్గీ వాసుదేవ్ కొంతకాలంగా తలనొప్పి, వాంతులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనకు స్కానింగ్ నిర్వహించగా.. బ్రెయిన్‌లో సమస్య ఉన్నట్లు వైద్యులు గమనించారు.
MLC KAVITHA: భార్య కోసం అనిల్ పోరాటం.. కవిత అనిల్ లవ్‌స్టోరికి ఫిదా అవ్వాల్సిందే..
వెంటనే మెరుగైన చికిత్స కోసం ఈ నెల 17న ఢిల్లీలోని అపొలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు మెడదులో బ్లీడింగ్ అవుతున్నట్లు తేల్చారు. పరిస్థితి విషమించకుండా ఉండాలంటే తక్షణం శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన డాక్టర్లు.. వెంటనే బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. డాక్టర్ వినీత్ సురీ నేతృత్వంలోని బృందం సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. సద్గురు ప్రస్తుత వయస్సు 66 సంవత్సరాలు. శస్త్ర చికిత్స తర్వాత సద్గురుకు సంబంధించిన ఆరోగ్యం మెరుగవుతున్నట్టు తెలిసింది. సద్గురు ఆరోగ్యం ఢిల్లీ అపొలో నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, జగ్గీ వాసుదేవ్ కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్ కూడా తొలగించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
సర్జరీ అనంతరం సద్గురు మాట్లాడిన వీడియోను ఆయన సిబ్బంది సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు. ఇటీవలే జగ్గీ వాసుదేవ్ శివరాత్రి రోజున జరిగిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి కూడా హాజరయ్యారు. కాగా.. సద్గురు నాలుగు నెలల నుంచి ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సద్గురు త్వరగా కోలుకోవాలని ఆయన ఫాలోవర్లు కోరుతున్నారు.