రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల చుట్టూ తిరుగుతూ అఘోరిగా చెప్పుకుంటున్న ఓ మహిళపై మహంకాళి పీఠం ఉపాసకుడు అభిరామ్ గురు భవాని కీలక వ్యాఖ్యలు చేసారు. అఘోరా నియమాలను మహిళా అఘోరీ పాటించడం లేదన్నారు. హిందూ ధర్మాన్ని, హిజ్రా సామాజిక వర్గాన్ని, అఘోర దీక్షను ఆమె కించపరుస్తుందని మండిపడ్డారు. అఘోర దీక్ష అంటే మరణించే వరకు దీక్షలో ఉండాల్సిందే అని స్పష్టం చేసారు.
అఘోరీగా చలామణి అవుతున్న ఆమెను నమ్మితే ప్రజల మోసపోతారని… అఘోరీ వెనుక ఎవరైనా ఉన్నారనే సందేహం కలుగుతుందన్నారు. కాగా ఆమె ఇటీవల ముత్యాలమ్మ గుడివద్ద ఆత్మాహుతి చేసుకుంటాను అని ప్రకటించిన నేపధ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆమెను వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చారు.