Aditya L1: లక్ష్యాన్ని చేరుకున్న ఆదిత్య ఎల్‌-1.. ఇస్రో మరో ఘనత

సూర్యుడి గురించి పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో తెలిపింది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లంగ్రాజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ చేరుకుందని ఇస్రో వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 05:38 PM IST

Aditya L1: గతేడాది చంద్రయాన్-3 విజయంతో దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఇస్రో.. ఇప్పుడు మరో అద్భుత విజయం అందుకుంది. ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. సూర్యుడి గురించి పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో తెలిపింది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లంగ్రాజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ చేరుకుందని ఇస్రో వెల్లడించింది. ఇది మన దేశం తొలిసారిగా ప్రయోగించిన సౌర పరిశోధన ఉపగ్రహం.

AR Rahman birthday : ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బర్త్ డే స్పెషల్ గా అరుదైన చిత్రాలు

ఇది నిర్దేశిత కక్ష్యలో ఉంటూ నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ 2న ఏపీ, శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-57 వ్యోమనౌక ద్వారా ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇంతకాలం ప్రయాణించి ఇది సూర్యుడికి దగ్గరగా, కక్ష్యలోకి చేరుకుంది. పలు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టిన తర్వాత. 125 రోజులకు ఇది లక్ష్యాన్ని చేరుకుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు ఆదిత్య ఎల్1 శాటిలైట్‌.. సూర్యుడి హ్యాలో ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. ఆ వెంటనే దాన్ని లాగ్రాంజ్ పాయింట్‌ 1లో ఇంజెక్ట్ చేసినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఈ లాగ్రాంజ్ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ మొత్తం ఏడు పే లోడ్లను మోసుకెళ్లింది.

సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్, హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్లు ఉన్నాయి. ఈ నాలుగూ రిమోట్ సెన్సింగ్‌తో పని చేస్తాయి. ఇవి ఇదివరకే యాక్టివేట్ అయ్యాయి. మిగిలిన మూడు ఇన్‌సైట్ పేలోడ్స్. వీటిలోని సోలార్ అల్ట్రావయెలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సూర్యుడిని అతి సమీపం నుంచి కొన్ని ఫొటోలను తీసింది. సూర్యుడి దగ్గరి వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ వంటి విషయాల్ని ఇది అధ్యయనం చేస్తుంది. అక్కడి నుంచి సమచారాన్ని ఇస్రో కేంద్రానికి పంపిస్తుంది. మరోవైపు ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ ఇస్రోను అభినందించారు.