IT Raids, BRS MLA : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నుంచి 20 లక్షలు స్వాధీనం..

ఎన్నికల వేళ వరుస ఐటీ దాడులు రాజకీయ నేతలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పటికే పలు కాంగ్రెస్‌ నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరగగా.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. తాండూరు ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి.. పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. తాండూరు, హైదరాబాద్‌లో ఉన్న రోహిత్‌ ఇళ్లపై దాడులు చేశారు ఐటీ అధికారులు. రోహిత్ నుంచి 20 లక్షలు, రోహిత్‌ తమ్ముడు రితీష్‌ నుంచి 24 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల వేళ వరుస ఐటీ దాడులు రాజకీయ నేతలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పటికే పలు కాంగ్రెస్‌ నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరగగా.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. తాండూరు ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి.. పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. తాండూరు, హైదరాబాద్‌లో ఉన్న రోహిత్‌ ఇళ్లపై దాడులు చేశారు ఐటీ అధికారులు. రోహిత్ నుంచి 20 లక్షలు, రోహిత్‌ తమ్ముడు రితీష్‌ నుంచి 24 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పలు కీలక డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాదీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ డాక్యుమెంట్లు ఏంటి అనే విషయం ఇప్పటికీ పోలీసులు చెప్పలేదు. రోహిత్‌ రెడ్డి ఇళ్లతో పాటు.. ఆఫీస్‌లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో తనిఖీలు ముగిసిన తరువాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్‌లోని ఓల్డ్‌ సిటీలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్‌ గ్రూప్స్‌ ఎండీ మజీద్‌ఖాన్‌ ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. కింగ్స్‌ గ్రూప్‌ ఓనర్‌ షానవాజ్ ఇంటితోపాటు పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్న ఈ వ్యాపారులు ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు అధికారులు.