Chandrababu : మరో నెల రోజులు జైలేనా ! (చంద్రబాబు)

చంద్రబాబు అరెస్ట్‌ అయ్యి దాదాపు నెల రోజులు కావొస్తోంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని రోజులు జైల్‌లో ఉండటం ఇదే మొదటిసారి. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికి వస్తున్నాయి. బెయిల్‌ వస్తుంది అనుకున్న ప్రతీ సారి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. చంద్రబాబుకు నిరాశే మిగులుతోంది.

సుప్రీం కోర్టులో రేపు కీలక వాదనలు..

చంద్రబాబు అరెస్ట్‌ అయ్యి దాదాపు నెల రోజులు కావొస్తోంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని రోజులు జైల్‌లో ఉండటం ఇదే మొదటిసారి. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికి వస్తున్నాయి. బెయిల్‌ వస్తుంది అనుకున్న ప్రతీ సారి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. చంద్రబాబుకు నిరాశే మిగులుతోంది. ఇప్పటికే మూడు సార్లు చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను పొడిగించింది ఏసీబీ కోర్టు. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే.. నవంబర్‌ 20 వరకూ చంద్రబాబు జైలులోనే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు కేసులో ముందు నుంచీ పీసీ యాక్ట్‌ 17ఏ అత్యంత కీలకంగా మారింది. ఈ యాక్ట్‌ చంద్రబాబుకు వర్తించదని చంద్రబాబు లాయర్లు, వర్తిస్తుందని సీఐడీ తరఫు లాయర్లు. ఇదే విషయంలో చాలా రోజుల నుంచి సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పీసీ సెక్షన్‌ 17ఏ చెల్లుబాటుకు సంబంధించి సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ మీద నవంబర్‌ 20న తీర్పు వచ్చే చాన్స్‌ ఉంది. ఇదే విషయాన్ని సుప్రీంలో సీఐడీ తరఫు లాయర్లు వినపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

నవంబర్‌ వరకూ జైల్‌లోనే చంద్రబాబు..?

ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో 17ఏ మీదే వాదనలు జరుగుతున్నాయి. ఆ సెక్షన్‌ చంద్రబాబుకు వర్తించబోదంటూ ఆయన తరఫు లాయర్లు వాదిస్తున్నారు. సుప్రీం కోర్టు నుంచి తీర్పు వచ్చే వరకూ చంద్రబాబు లాయర్ల వాదనను పట్టించుకోవద్దని స్టే తెచ్చేలా సీఐడీ లాయర్లు సుప్రీం కోర్టును కోరబోతున్నట్టు సమాచారం. ఒక వేళ వాళ్ల వాదనకు సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందిస్తే నవంబర్‌ 20న సుప్రీం తీర్పు వచ్చే వరకూ వెయిట్‌ చేయాల్సిందే. అంటే అప్పటి వరకూ చంద్రబాబు జైలులో ఉండాల్సిందే. ఈ విషయంలో రేపు క్లారిటీ రాబోతుంది. సీఐడీ తరఫు లాయర్ల వాదనకు సుప్రీం నుంచి ఎలాంటి రియాక్షన్‌ వస్తుంది అనేది సస్పెన్స్‌గా మారింది.