Senior Heroines : సీనియర్ హీరోయిన్లకు.. హీరోలు దొరకడం లేదు..?

సౌత్ లో గత రెండు, మూడు నెలలుగా చూసుకుంటే సీనియర్ హీరోయిన్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టే కనిపిస్తున్నారు. రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో కీలక పాత్రలో నటించింది తమన్నా.. కనిపించింది కాసేపే అయినా గ్లామర్ షో తో థ్రిల్ చేసింది.

సీనియర్ హీరోలు హీరోయిన్ ని సెట్ చేయడం అనేది బిగ్ టాస్క్. కథ కత్తిలా ఉన్న జోడీ సెట్ కాకపోతే అసలుకే ఎసరోస్తుంది. హిట్ అవ్వాల్సిన మూవీ కూడా ఫ్లాప్ అవుతుంది. అందుకే హీరోయిన్ విషయంలో స్ట్రగుల్ అవుతున్న బడా స్టార్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు సీనియర్ బ్యూటీస్. కొత్త సినిమాలతో హిట్ కొట్టి ఆ ప్లేస్ ని ఫుల్ ఫిల్ చేసుకున్నారు.

మళ్లీ తెరపైకి వచ్చిన పాత తారలు..

సౌత్ లో గత రెండు, మూడు నెలలుగా చూసుకుంటే సీనియర్ హీరోయిన్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టే కనిపిస్తున్నారు. రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో కీలక పాత్రలో నటించింది తమన్నా.. కనిపించింది కాసేపే అయినా గ్లామర్ షో తో థ్రిల్ చేసింది. ఇందులో ఆమెది చిన్న పాత్రే అయినా.. కథకి కీలకంగా మారడంతో సినిమా సూపర్ సక్సెస్ అయింది. దీంతో తమన్నా ఖాతాలో సినిమాల సంఖ్య పెరుగుతోంది. వెబ్ కంటెంట్ రూపంలో కూడా ఆమె గట్టిగా వసూలు చేస్తుంది. ప్రజెంట్ తమన్నా జోరు చూస్తుంటే ఇంకో రెండేళ్ల పాటు ఛాన్స్ ల కోసం ఇబ్బంది పడనవసరం లేదు.

ఫామ్ లోకి వచ్చిన దేవసేన..

భాగమతి తర్వాత థియేటర్ లో అడుగు పెట్టని అనుష్క ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మళ్లీ భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది.ఆమె హైట్ వల్ల యంగ్ హీరోల పక్కన చేసే అవకాశం లేదు అన్న వారికి ఈ సినిమాతో గట్టి సమాధానం చెప్పింది. కథ డిమాండ్ చేస్తే యంగ్ హీరోల పక్కన అనుష్క బాగా సెట్ అవుతుంది చాటి చెప్పింది. పోలిశెట్టి విజయం అనుష్క ని మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. చిరంజీవి చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్ లో స్వీటీ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫామ్ లోకి వచ్చిన లేడీ సూపర్ స్టార్స్..

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పటికే సూపర్ ఫామ్ లో ఉంది. తెలుగులో అంతగా సినిమాలు చేయడం లేదు అనే కంప్లైంట్ ఉన్నా.. ‘గాడ్ ఫాదర్’ వంటి సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పుడు ‘జవాన్’ కూడా సక్సెస్ అవ్వడం తో.. బాలీవుడ్ లో కూడా ఆమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పొన్నియన్ సెల్వన్ సీరిస్ తో హిట్ అందుకుంది త్రిష. ఆమె కూడా ఫామ్ లోకి వచ్చింది. మొత్తానికి సీనియర్ బ్యూటీస్ మళ్లీ పుంజుకోవడం తో బడా స్టార్స్ కి హీరోయిన్స్ కొరత తీరినట్లే కనిపిస్తోంది.