Sai Pallavi : ఒకేసారి రెండు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు.. సాయిపల్లవితో అట్లుంటది మరి..

అందం, ఆరబోత మాత్రమే సినిమాల్లో హీరోయిన్ పనులు అనుకుంటున్న సమయంలో.. ఓ తార మెరుపులా దూసుకువచ్చింది. అప్పటివరకు ఉన్న లెక్కలను, మాటలను, అంచనాలను తారుమారు చేసింది.

అందం, ఆరబోత మాత్రమే సినిమాల్లో హీరోయిన్ పనులు అనుకుంటున్న సమయంలో.. ఓ తార మెరుపులా దూసుకువచ్చింది. అప్పటివరకు ఉన్న లెక్కలను, మాటలను, అంచనాలను తారుమారు చేసింది. యాక్టింగ్‌ అద్భుతం అనిపించాలే కానీ.. అందంతో పెద్ద పని లేదు అని ప్రూవ్ చేసింది. ఆమె సాయిపల్లవి. మళయాళీ ముద్దుగుమ్మ అయిన పల్లవి.. ఎంటర్ అయిన ప్రతీ ఇండస్ట్రీకి.. సొంతింటి పిల్ల అయిపోయింది. తెలుగు, తమిళ్‌.. ఇలా ప్రతీ ఇండస్ట్రీలో సాయిపల్లవిని ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. టాలీవుడ్‌లో అయితే మరీ! అమ్మడుకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. లేడీ పవర్‌స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు పల్లవిని! అలాంటి అమ్మడు ఇప్పుడు రికార్డు క్రియేట్ చేసింది.

ఒకేసారి రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకునేందుకు రెడీ అయింది. మాములుగా ఒకసారి ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డు వస్తేనే అద్భుతం అనుకుంటున్నారు. అలాంటిది సాయిపల్లవికి బెస్ట్ హీరోయిన్‌గా రెండు అవార్డులు అందుకోబోతోంది. 2023 సంవ‌త్సరానికి సౌత్ ఫిలింఫేర్ అవార్డుల‌ను ప్రక‌టించారు. వీటిలో RRR, సీతారామం చిత్రాలు స‌త్తా చాటి ఎక్కువ అవార్డుల‌ను దక్కించుకున్నాయ్. సాయిపల్లవి యాక్ట్ చేసిన విరాటప‌ర్వం మూవీ.. రెండు అవార్డుల‌ను కైవసం చేసుకుంది. తెలుగులో క్రిటిక్స్ విభాగంలో ఉత్తమనటిగా అవార్డు దక్కించుకున్న సాయిపల్లవి.. తమిళంలో గార్గి మూవీకి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అందుకోబోతోంది.

ఇలా ఒకేసారి రెండు భాషల్లో.. ఒకే కేటగిరిలో రెండు అవార్డులు అందుకోవడం మాములు విషయం కాదు అంటూ.. సాయి పల్లవి ఫ్యాన్స్.. తెగ మురిసిపోతున్నారు. అంతేకాదు.. సౌత్ ఇండియాలో త‌క్కువ కాలంలో ఆరుసార్లు ఫిలింఫేర్ అవార్డు ద‌క్కించుకున్న హీరోయిన్‌గా సాయిపల్లవి రికార్డు క్రియేట్ చేసింది. ఇంత‌కుముందు నాలుగు సార్లు, ఇప్పుడు రెండు అవార్డులతో క‌లుపుకుని మొత్తంగా 6అవార్డులు రాగా… ఇందులో 4అవార్డులు తెలుగు చిత్రాల‌కే వచ్చాయ్‌. ప్రస్తుతం సాయిపల్లవి.. నాగచైతన్యతో కలిసి తండేల్‌ మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో లవ్‌స్టోరీ వచ్చింది. మంచి ప్రశంసలు అందుకుంది.