బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ అంటారు. ఎపుడైతే రామ్ చరణ్, ఉపాసన కుటుంబంలో క్లీంకార వచ్చిందో అప్పటి నుంచి ఆ కుటుంబంలో అన్ని శుభాలే. ఒకదాని వెనక మరొకటి మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెల్లి విరుస్తున్నాయి.దీంతో మరోసారి క్లీంకారా పేరు ట్రెండింగ్ లో నిలిచింది.
క్లీంకార రాకతో మెగా కుటుంబానికి మూల స్థంభం అయిన మెగస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ తో గౌరవించింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగాభినులు పండగ చేసుకున్నారు. ఇంకోవైపు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. దీంతో ఆయనకు తమిళనాడుకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీ.. బీజేపీ, టీడీపీ కూటమితో కలిసి ప్రభంజనం సృష్టించింది. అంతేకాదు పోటీ చేసిన రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 21 శాసన సభ స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన తొలి పార్టీగా జనసేన సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఏపీ శాసనసభలో టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఒక రకంగా క్లీంకారా వచ్చిన తర్వాత మెగా కుటుంబంలో జరిగిన మరో అద్భుతం. ఈ రకంగా క్లీంకారా పుట్టిన తర్వాత తండ్రి రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ తో పాటు తాత చిరంజీవికి పద్మవిభూషణ్.. అందుకున్నారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో సంచలనం రేపడంతో అందరు ఇదంత క్లీంకారా ఏ సమయంలో కుటుంబంలో అడుగుపెట్టిందో అన్నింట్లో మెగా కుటుంబానికి అంతా మంచి జరిగింది. దీంతో మెగాభిమానులు అందరు క్లీంకారాను లక్కీ గర్ల్ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.