Jammu Kashmir : జమ్ముకాశ్మీర్లో కార్చిచ్చు.. బుగ్గి బూడిద అవుతున్న భూతల స్వర్గం

జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లో ఆగని కార్చిచ్చు.. జమ్మూకాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలోని అడవుల్లో కార్చిచ్చు అంటుకున్న విషయం తెలిసిందే.. ఆ కార్చిచ్చు పాక్ - భారత్ నియంత్రణ రేఖ (LOC) వద్ద అటవీ ప్రాంతంలో సోమవారం మంటలు అంటుకున్నాయి. ఆ మంటలను అర్పెందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లో ఆగని కార్చిచ్చు.. జమ్మూకాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలోని అడవుల్లో కార్చిచ్చు అంటుకున్న విషయం తెలిసిందే.. ఆ కార్చిచ్చు పాక్ – భారత్ నియంత్రణ రేఖ (LOC) వద్ద అటవీ ప్రాంతంలో సోమవారం మంటలు అంటుకున్నాయి. ఆ మంటలను అర్పెందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఇలాంటి కార్చిచ్చు అంటుకుంటుందని ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బల్వంత్ సింగ్ తెలిపారు. తమ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు 8 చోట్ల కార్చిచ్చు అంటుకుందని ఆయన తెలిపారు.

కాగా ఇక్కడ కార్చిచ్చుతో పాటు మరో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. కార్చిచ్చు అంటుకున్న అటవీ ప్రాంతం పాక్-భారత్ (Pak-India) దేశ సరిహద్దు ప్రాంతం కావడంతో పాక్ ఉగ్రవాదులు (Pakistani terrorists) భారత్ లోకి చోరబడేందుకు అనులంగ ఉంది. ఈ భారీ కార్చిచ్చుకు తోడు.. జమ్ము-కాశ్మీర్ (Jammu Kashmir), పూంఛ్ జిల్లాలో(Poonch) ఉన్న ల్యాండ్‌మైన్లు పేలుతున్నాయని అధికారులు వెల్లడించారు. కార్చిచ్చు ప్రభావంతో మూడు రోజులుగా దాదాపు 12 ల్యాండ్‌మైన్లు (landmine)పేలినట్లు అధికారులు తెలిపారు. నిన్న దాదాపు మంటలు అదుపులోకి వచ్చిన సమయంలో వేగంగా ఈదురు గాలులు వీయడంతో.. దరమ్ శల్ ప్రాంతానికి కార్చిచ్చు వ్యాపించింది. అక్కడి నుంచి వరుసగా.. రాజౌరి జిల్లాలోని సుందర్ బండి, గంభిర్, నిక్కా, బ్రహ్మణ, మొఘల వంటి అనేక ప్రాంతాల్లో కూడా మంటలు అంటుకున్నాయి.