Telangana Politics: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనేనా..

తెలుగు రాష్ట్రాల బీజేపీలో అత్యంత కీలక సమావేశం ఈ రోజు జరగబోతోంది. రానున్న పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ జాతీయ అధినాయకత్వం నేడు కీలక సమావేశం నిర్వహించబోతోంది.

  • Written By:
  • Publish Date - July 3, 2023 / 10:02 AM IST

కేంద్ర మంత్రులు, ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ హై కమాండ్‌ ఫోకస్‌ చేసింది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే అధ్యక్షుడు బలమైన వ్యక్తిగా ఉండాలి. కేంద్రలో ఉన్నత స్థాయిలో ఉండాలి. దీంతో ఎన్నికలు జరిగే ప్రతీ రాష్ట్రం నుంచి ఓ సీనియర్‌ ఎంపీకి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చే యోచనలో బీజేపీ ఉంది. దాంతో పాటు అధ్యక్షుల మార్పు జరిగే చాన్స్‌ కూడా ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.

ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని ఆ పదవి నుంచి తొలగించి కేబినెట్‌లోకి తీసుకునే చాన్స్‌ ఉంది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డిని పదవి నుంచి తప్పించి రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని బీజేపీ హైకమాండ్‌ భావిస్తోంది. తెలంగాణలో బండి సంజయ్‌కి సీనియర్‌ నేతలకు కొన్ని రోజులగా పడటంలేదు అన్న విషయం అందిరికీ తెలిసిన ఓపెన్‌ సీక్రెట్‌. ఇలాంటి సదర్భంలో పార్టీని బలోపేతం చేసి అధికారం దిశగా నడిపించే వ్యక్తి అందరికీ నచ్చినవాడై ఉండాలి. దానికి కిషన్‌ రెడ్డి సరైన వ్యక్తి అనే భావనలో హైకమాండ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. కిషన్‌ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్‌కు కూడా ఈ మీటింగ్‌ అనంతరం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

ఇక ఏపీలో ఎన్నో రోజుల నుంచి పొత్తుల విషయం సస్పెన్స్‌లో ఉంది. ఈ మీటింగ్‌తో ఆ సస్పెన్స్‌కు తెరపడబోతోంది. జనసేనతో కలిసి పోటీ చేస్తామని చెప్పిన బీజేపీ ఆ తరువాత ఆ మాట కూడా ఎత్తలేదు. ఇప్పుడు ఏపీలో స్ట్రాంగ్‌ అవ్వాలి అంటే అక్కడి నుంచి ఉన్న ఏకైక బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుకు మంత్రి పదవి ఇవ్వాలి. లేదంటే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ నుంచి ఒకరికి కేంద్రంలో పదవి ఇవ్వాలి. ఈ రెండు జరగలేదు అంటే బీజేపీ అధినాయకత్వం వైసీపీకి మద్దతిచ్చినట్టే లెక్క. ఇదే జరిగితే ఏపీలో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారే చాన్స్‌ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలో బీజేపీ భవిష్యత్తుపై ఈ మీటింగ్‌ తరువాత క్లారిటీ రానుంది. దీంతో ఈ మీటింగ్‌ అత్యంత కీలకంగా మారింది.