World Cup: ప్రపంచకప్ ముందు పాత పగల తవ్వకాలు

న్యూజిలాండ్ అండర్ డాగ్స్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రస్తుతానికి అయితే ఈ నాలుగు జట్లలో ఒకటి ప్రపంచకప్ గెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 02:02 PM IST

భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు హాట్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతున్నాయి. న్యూజిలాండ్ అండర్ డాగ్స్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రస్తుతానికి అయితే ఈ నాలుగు జట్లలో ఒకటి ప్రపంచకప్ గెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2023 కి అన్ని జట్లు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 5 నుంచి దాదాపు నెలన్నర రోజుల పాటు క్రికెట్ మహా సంగ్రామం అభిమానులను అలరించనుంది. అక్టోబర్ 19న జరిగే ఫైనల్ తో ప్రపంచకప్ ముగుస్తుంది. మొన్నటి వరకు ప్రపంచకప్ ఫేవరెట్ గా కనిపించిన పాకిస్తాన్ జట్టులో ప్రస్తుతం లుకలుకలు కనిపిస్తున్నాయి. ఇటీవలె ముగిసిన ఆసియా కప్ నుంచి ఆ జట్టులో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కూడా తెలుస్తుంది.

ముఖ్యంగా బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై పలువురు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా బాబర్ ఆజమ్, వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ల మధ్య కూడా విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్ లో షాదాబ్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ క్రమంలో బాబర్ ఆజమ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టాస్ సమయంలో మాట్లాడుతూ.. బాబర్ ఆజమ్ 12వ ప్లేయర్ గా ఉంటాడని.. అతడు తమకు డ్రింక్స్ తెస్తూ కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చివర్లో బాబర్ ఆజమ్ మైదానంలోకి వచ్చాడు. అయినప్పటికీ షాదాబ్ ఖానే కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక ఈ మ్యాచ్ లో షాదాబ్ ఖాన్ బౌలర్ గా బ్యాటర్ గా విఫలం అయ్యాడు. అయితే బాబర్ ఆజమ్ 90 పరుగులతో చెలరేగాడు. అయితే కీలక సమయంలో రిటైర్డ్ హర్ట్ గా వైదొలిగాడు. పాకిస్తాన్ జట్టును క్షుణ్ణంగా పరిశీలిస్తే అంతర్గత విభేదాలు ఉన్నట్లు స్పష్టమౌతుంది. ముఖ్యంగా బాబర్ ఆజమ్ కెప్టెన్సీని కొంత మంది ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రపంచకప్ లో పాక్ జట్టు ఎలాంటి ఆటతీరును కనబరుస్తుందో చూడాలి.