Prabhas: పాన్ ఇండియా సినిమా కాదు

పాన్ ఇండియా జర్నీకి రెబల్ స్టార్ షార్ట్ బ్రేక్ అంటున్నారు. మారుతి మేకింగ్ లో తీసే సినిమా హిందీలో రాదా? రెండు కారణాలతో మారుతి మూవీకి లిమిట్స్ పెడుతున్నారా? అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 06:00 PM IST

బాహుబలి, బాహుబలి 2 ఇలా రెండు పాన్ ఇండియా సునామీలు వచ్చాక సాహో తో కిక్ ఇచ్చాడు ప్రభాస్. ఇక తను ఏం చేసినా, ఏం తీసినా పాన్ ఇండియా మూవీ అయ్యి తీరాల్సిందే. వచ్చిన క్రేజ్, పెరిగిన మార్కెట్ లోమైలేజ్ అలాంటివి. అందుకే ఓ నార్మల్ స్టోరీ అయిన రాధేశ్యామ్ ని కూడా 250 కోట్లు పెట్టి పాన్ఇండియా లెవల్లో తీశారు.

అలాంటప్పడు సడన్ గా ప్రభాస్ ఓ మూవీ తీసి అది పాన్ ఇండియా మూవీ కాదంటే, అది కుదరే పనేనా? అసలే ఆదిపురుష్ ఆడకున్నా ప్రభాస్ క్రేజ్ వల్ల జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డులు చూశాం. అలాంటి తను సడన్ గా పాన్ ఇండియా ఫార్ములాని ఒకే ఒక్కమూవీకి అప్లై చేయనంటున్నాడట.

డైరెక్టర్ మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా పాన్ ఇండియా మూవీ కాదంటున్నారు. ఇదో హర్రర్ కామెడీ అవటంతో, ఈప్రయోగం నార్త్ లో రీచ్ ఉండదనే అభిప్రాయానికి ఫిల్మ్ టీం వచ్చిందట. అసలే ఫెల్యూర్స్ తో దెబ్బలు తగిలి ఉన్నాయి. ఇలాంటి టైంలో మారుతి మేకింగ్లో కామెడీ హర్రర్ వర్కవుట్ కాకపోతే ఇమేజ్, క్రేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలాగూ సలార్, కల్కీ 2898 లాంటివి పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులుపుతాయి. సో కంటెంట్ పరంగా మారుతి మేకింగ్ లోప్రభాస్ చేసే సినిమాని సౌత్ వరకే లిమిట్ చేస్తే ఎలా ఉంటుందనే డిస్కర్షన్ జరుగుతోంది. ఇలా అనుకోవటానికి కారణం సలార్. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఊరమాస్ మార్కెట్ ని ఊపేసే ఛాన్స్ ఉంది. ఆతర్వాత వెంటనే కామెడీ హర్రర్ అంటే వర్కవుట్ కాదేమో అనేది ప్రభాస్ అభిప్రాయమట.