IT raids in Hyderabad : హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం.. సబిత బంధువుల ఇంట్లో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు.

తెలంగాణ ఎన్నికల వేళ మరోసారి హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్ మరో 17 రోజులు మాత్రమే సమయం ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

తెలంగాణ ఎన్నికల (Telangana Elections) వేళ మరోసారి హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ (IT Raids)  కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్ మరో 17 రోజులు మాత్రమే సమయం ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ నగరంలోని ఫార్మా కంపెనీలకు చెందిన ఛైర్మన్‌, సీఈవో, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో , కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. ఇక మై హోం శాఖలో ఉన్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ( Sabitha Indra Reddy) బంధువుల నివాసాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని మై హోం బూజాలో ఉంటున్న ప్రదీప్ అనే వ్యక్తి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Chandramohan : నేడు పంజాగుట్ట స్మశాన వాటికలో సినీ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు

ఇటీవల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం పై కూడా ఐటీ అధికారులు తనీఖీలు చేశారు. ఖమ్మం లోనే కాకుండా హైదరాబాద్ లోని తన ఇంట్లో, ఆఫీసుల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు. కాగా నిన్నటి వరకు రాజకీయ నాయకుల ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు.. దిశ మార్చి ఇప్పడు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.