Prabhas : డిమాండ్ పెరిగిందా..? తగ్గిందా..? అర్థం కాని ప్రభాస్ గ్రాఫ్..

హీరోలందరిలో ప్రభాస్‌ ఒక్కడే ఖాళీగా వున్నట్టు.. డైరెక్టర్స్‌ అందరూ డార్లింగ్ పక్కకు చేరుతున్నారు. ఏ డైరెక్టర్‌ను కదిలించినా.. ప్రభాస్‌తో సినిమా అంటున్నారు. ఇలా డార్లింగ్‌ ఖాతాలో అరడజను సినిమాలు చేరాయి. కొత్తగా ఇప్పుడు మరి కొందరు దర్శకులు చేరారు. ఏ హీరోకూ లేనన్ని సినిమాలు ప్రభాస్‌ చేతిలో వున్నారు. సలార్‌ ఫస్ట్ పార్ట్‌ డిసెంబర్‌ 22న రిలీజ్‌ అవుతోంది. మరి సెకండ్‌ పార్ట్‌ ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేం.

హీరోలందరిలో ప్రభాస్‌ ఒక్కడే ఖాళీగా వున్నట్టు.. డైరెక్టర్స్‌ అందరూ డార్లింగ్ పక్కకు చేరుతున్నారు. ఏ డైరెక్టర్‌ను కదిలించినా.. ప్రభాస్‌తో సినిమా అంటున్నారు. ఇలా డార్లింగ్‌ ఖాతాలో అరడజను సినిమాలు చేరాయి. కొత్తగా ఇప్పుడు మరి కొందరు దర్శకులు చేరారు. ఏ హీరోకూ లేనన్ని సినిమాలు ప్రభాస్‌ చేతిలో వున్నారు. సలార్‌ ఫస్ట్ పార్ట్‌ డిసెంబర్‌ 22న రిలీజ్‌ అవుతోంది. మరి సెకండ్‌ పార్ట్‌ ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేం. ప్రశాంత్‌ నీల్‌ నెక్ట్స్‌ మూవీ ఎన్టీఆర్‌తో వుంటుంది. ఆతర్వాత కెజిఎఫ్‌-3 పూర్తయితేగానీ సలార్‌2 గురించి ఆలోంచడు. ఇక ప్రభాస్‌ కల్కితో పాన్‌ వరల్డ్ లోకి అడుగుపెడుతూ.. 2024లో వస్తాడు. మారుతి సినిమా కూడా వచ్చే ఏడాదే రిలీజ్‌ అవుతుంది. వాయిస్‌ సినిమాల మీద సినిమాలు చేసేస్తూ.. షాక్స్‌మీద షాక్స్‌ ఇస్తున్నాడు ప్రభాస్‌. అర్జున్‌రెడ్డి ఫేం సందీప్‌ వంగా మూవీ ‘స్పిరిట్‌’ తోపాటు.. ఇంకో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్‌ లైన్లో ఉన్నారు. సందీప్‌ రణ్‌బీర్‌కపూర్‌ తో తీస్తున్న యానిమల్ డిసెంబర్‌1న రిలీజ్‌ అవుతుంది. ఓ ఆరు నెలలపాటు కథ రెడీ చేస్తే.. ప్రభాస్‌ మూవీ 2024లో సెట్స్‌పైకి వస్తుంది. ఈలోగా.. కల్కి.. మారుతి సినిమాలు పూర్తి చేస్తాడు ప్రభాస్‌. స్పిరిట్‌లో ప్రభాస్‌ ఫస్ట్ టైం పోలీస్‌గా నటిస్తూ.. ఖాకీ డ్రస్‌తో కనిపించనున్నాడు. మంచు విష్ణు నటిస్తూ..నిర్మిస్తున్న ‘కన్నప్ప’లో ప్రభాస్‌, నయనతార కలిసి నటిస్తున్నారు. ఆల్రెడీ మేకింగ్‌ వీడియోతో ఇన్‌డైరెక్టర్‌గా ప్రభాస్‌ పేరు ప్రకటించాడు విష్ణు. ఇంకా ఎనౌన్స్‌ చేయకపోయినా.. ప్రభాస్‌ లిస్టులోకి లోకేశ్‌ కనగరాజ్‌.. హను రాఘవపూడి వున్నారు. అయితే లోకేశ్‌ రజనీకాంత్‌తో సినిమాను ఎనౌన్స్‌ చేయడంతో.. ఇప్పట్లో ప్రభాస్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం లేదు. సీతారామంతో హను రాఘవపూడి స్టార్‌ డైరెక్టర్‌ అయిపోవడమే కాదు.. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ అందుకున్నాడన్న వార్త మరో పక్కన వినిపిస్తోంది. సీతారామం తీసిన స్వప్న మూవీస్ ఈ సినిమాను నిర్మించనుందని టాక్‌. లెక్కకు మించిన ప్రాజెక్ట్స్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు పండుగే అయినా.. ఇన్ని సినిమాలు ఎలా చేస్తాడన్న డౌట్‌ లేకపోలేదు. ప్రస్తుతం నీ సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకున్న డార్లింగ్‌ రెండు నెలల తర్వాత సలార్‌ ప్రమోషన్‌తో బైటకు వస్తాడు. ఆతర్వాతే కల్కి షూటింగ్‌లో పాల్గొంటాడు.