Congress: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రూ.1700 కోట్లు ఫైన్ కట్టాలని ఐటీ శాఖ కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 2017-18 నుంచి 2020-21 వరకు చెల్లించాల్సిన పన్ను, పెనాల్డీ, వడ్డీ.. ఇలా అన్నీ కలిపి రూ.1700 కోట్లకుపైగా చెల్లించాలని ఐటీ విభాగం స్పష్టం చేసింది. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమకు నోటీసులు ఇచ్చేముందు.. ఐటీ శాఖ బీజేపీకి నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
TDP LIST: టీడీపీ తుది జాబితా విడుదల.. భీమిలి టిక్కెట్ గంటాకే..
కాంగ్రెస్ సీనియర్ లీడర్లు జైరాం రమేశ్, అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. బీజేపీ సుమారు రూ.4,600 కోట్ల రూపాయల ఫైన్ కట్టాల్సి ఉందని, దీనిపై ఐటీ శాఖ దృష్టి పెట్టాలని సూచించారు. తమకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల్ని ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. గతంలోనూ రూ.200 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు కూడా ఇచ్చింది. తమ బ్యాంక్ ఖాతాల్ని స్తంభింపజేయడంపై కాంగ్రెస్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ, ఈ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. గురువారం పిటిషన్లను తిరస్కరించిన వెంటనే కాంగ్రెస్‌కు రూ.1700 కోట్లపై నోటీసులు అందాయి. దీంతో ఐటీ నోటీసులపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఐటీ నోటీసులపై మండిపడ్డారు. తమ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం బీజేపీ కుట్ర అన్నారు.
ఎన్నికల వేళ తమను ఇబ్బంది పెట్టేందుకే కేంద్రం ఇలా చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ఖర్చులకు.. చివరకు సిబ్బంది జీతాలకు, పెట్రోల్‌కు కూడా డబ్బులు లేవన్నారు. తాజాగా జైరాం రమేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకే ఐటీ శాఖతో బీజేపీ దాడులు చేయిస్తోందన్నారు. దీన్ని ట్యాక్స్ టెర్రరిజంగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంపై దాడి కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఆదాయపు పన్ను చట్టం నిబంధనలు బీజేపీ తీవ్రంగా ఉల్లంఘించిందని, ఆ పార్టీ నుంచి కూడా రూ.4,600 కోట్లు వసూలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.