ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం వేళ జమ్మూ కాశ్మీర్లోని (Jammu and Kashmir) రియాసి జిల్లాలో వైష్ణోదేవి ఆలయ (Vaishno Devi Temple) సందర్శనకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది మరణించిగా.. చెందగా 33 మంది తీవ్రంగా గాయపడ్డిన విషయం తెలిసిందే. జమ్మూలోని రియాసిలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద (Terror Attack) సంస్థ లష్కరే తాయిబా (ఎస్ఈటీ) వుందని తేలింది. ఈ ఘటనకు పాల్పడింది తామేనని లష్కరే తాయిబాకు చెందిన (టీఆర్ఎఫ్) ప్రకటించింది. 12 మంది ఉగ్రవాదులు రెండు మూడు గ్రూపులుగా విడిపోయి రాజౌరి-పూంచ్ అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారు. వీరిలో పాకిస్థాన్ జాతీయులు కూడా ఉన్నారు. పాకిస్థాన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే జరిగిన ఈ ఘటన దేశంలో ఒక్కసారిగా కలకలం రేపింది.