PK ON JAGAN, BJP : జగన్ గెలవడం కష్టమే.. తెలంగాణలో బీజేపీ హవా..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM Jagan) మళ్ళీ గెలవడం కష్టం.... అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM Jagan) మళ్ళీ గెలవడం కష్టం…. అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. PTI ఎడిటర్స్ ఇంటర్వ్యూలో పీకే (PK) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజరిక వ్యవస్థలో చక్రవర్తుల లాగా తాయిలాలిస్తే సరిపోదన్నారు. జగన్ నగదు బదిలీ చేశారు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు ప్రశాంత్ కిషోర్. దక్షిణాదిలో బీజేపీ పుంజుకుంటుందనీ… తెలంగాణలో ఆ పార్టీ ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్ లో నిలుస్తుందని చెప్పారు.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పాలన మోనార్క్ తరహాలో ఉందన్నారు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. తాను ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడిలా కాకుండా… ఓటర్లకు ఒక ప్రొవైడర్ లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జనానికి డబ్బులు ఇచ్చినా.. ఛత్తీస్ గఢ్ సీఎం బఘేల్ లా ఓడిపోయారు. ప్రజలకు డబ్బులు పంచడానికే జగన్ పరిమితం కావడంతో … రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయింది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నాయకుడు… ప్రజలకు డబ్బులు ఇవ్వడమే కాదు… వారి ఆశలను కూడా నెరవేర్చాలి. తాను రాజును అనే భ్రమలో డబ్బులు పంచుకుంటూ పోతే జనం ఓట్లేయరని అన్నారు. రోడ్లు వేసినా… వేయకున్నా… రాజధాని ఉన్నా లేకపోయినా… ఫ్యాక్టరీలు కట్టకున్నా… నెలకు 2 వేలు ఇస్తానంటే సరిపోదనీ… ఉద్యోగాలు కూడా కల్పించాలని అన్నారు ప్రశాంత్ కిషోర్.

తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుందనీ… ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి లేదా రెండు స్థానాల్లో నిలుస్తుందన్నారు పీకే. ఇది చాలా పెద్ద విషయమన్నారు. అలాగే ఒడిశా, బెంగాల్ లో నెంబర్ ఒన్ లో కాషాయం పార్టీ ఉంటుందని చెప్పారు. బీజేపీ పెద్దలు మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు తరుచుగా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించవడం వల్ల సౌత్ లో ఆ పార్టీ బాగా పుంజుకున్నట్టు తెలిపారు. అలాగే బీజేపీ వైఫల్యాలను కాంగ్రెస్ క్యాష్ చేసుకోవట్లేదన్నారు ప్రశాంత్ కిషోర్. బీజేపీని ఎదుర్కునే నాయకత్వం, ఎజెండా కూటమికి లేవు… అందుకే ఆ పార్టీ పదే పదే గెలుస్తుందన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోతే రాహుల్ రాజకీయాలను నుంచి తప్పుకోవడం బెటర్ అని సలహా ఇచ్చారు పీకే