ప్రపంచ వ్యాప్తంగా రైలు ప్రమాదాలు తరచు భారత దేశంలో జరుగుతాయి. దురదృష్టవశాత్తు గానీ.. సిగ్నింగ్ లోపంలో గానీ.. ఆకతాయిలు చేసిన పనుల కారణంగానో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఈ మధ్య అభివృద్ధి చేందిన దేశాల్లో కూడా ఈ తరహ రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదం ఎక్కడో ఎలానో చూద్దాం రండి..
ఈ రైలు ప్రమాదం ఇటలీలో జరిగింది.. ఇటలీలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 17 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి ఉత్తర ఇటలీలో ఎదురెదురుగా వస్తున్న రెండు హై స్పీడ్, ఎక్స్ ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం రెండు రైళ్లు కూడా తక్కువ వేగంతో నడుస్తున్నందున ప్రమాదం ఎక్కు సంభవించలేదు. ఈ ప్రమాదం ఉత్తర ఇటలీలోని బోలోగ్నా, రిమిని మధ్య లైన్ లో ఒకే ట్రాక్ పై హై-స్పీడ్, ప్రాంతీయ రైలు ఫెన్జా నగరం, ఫోర్లి కమ్యూన్ మధ్య చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలతో బయటపడ్డారు.
ఈ రైలు ప్రమాదంపై ఇటలీ దేశ ఉప ప్రధానమంత్రి, రవాణ శాఖ మంత్రి మాటియో సాల్విని మాట్లాడుతూ తాను పరిస్థితిని సమీక్షిస్తునని, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదం ఢీకొన్న రెండు రైళ్లో హైస్పీడ్ రైలు ముందుభాగం నుజ్జునుజ్జువగా.. ఎక్స్ ప్రెస్ రైలు మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు.