CM Jagan: ముందస్తు ఎన్నికలపై జగన్ క్లారిటీ చంద్రబాబుకు భారీ షాక్ తగిలిందా ?

ముందస్తు ఎన్నికలపై ఏపీలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఈ మధ్య జగన్ ఢిల్లీ పర్యటన చుట్టూ వినిపించిన చర్చ అంతా ఇంతా కాదు. ఆయన హస్తినలో ఉండగానే.. ఇక్కడ కేబినెట్‌ మీటింగ్ ప్రకటన రావడంతో.. ముందస్తు ఖాయం అని.. కేబినెట్ భేటీ తర్వాత క్లారిటీ ఇస్తారని అనుకున్నారు అంతా ! కేంద్ర పెద్దలతో ఢిల్లీలో రహస్యంగా భేటీ అయిన జగన్.. ముందస్తుకు సంబంధించి గ్రీన్‌సిగ్నల్ కూడా తెచ్చుకున్నారని వినిపించిన గుసగుసలు అన్నీ ఇన్నీ కావు.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 05:44 PM IST

ఐతే ఇలాంటి ప్రచారానికి ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు జగన్‌. నిజానికి ముందస్తు ఎన్నికల చర్చ తీసుకొచ్చిందే చంద్రబాబు. ఐతే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ.. జగన్‌ నుంచి ఓ లీక్ వినిపించింది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత.. మంత్రులతో జగన్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ముందస్తు ఎన్నికలపై బయట జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. దీంతో మంత్రులకు కూడా స్పష్టత వచ్చినట్లు అయింది. ఎన్నికలకు ఇంకా 9నెలలు మాత్రమే సమయం ఉందని.. ఈ 9 నెలలు కష్టపడితే గెలుపు మనదే అని మంత్రులకు సూచించారు జగన్.

అంటో పరోక్షంగా ముందస్తు ఎన్నికలు లేవు అని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటి నుంచి ప్రతీ నాయకుడు.. జనాల్లోనే ఉండాలని, జనాల్లోనే కనిపించాలని కూడా ఆదేశించారు. 9 నెలలు బాగా కష్టపడితే.. క్లీన్‌స్వీప్‌ చేయడం కూడా పెద్ద విషయం కాదని మంత్రుల ద్వారా పార్టీ శ్రేణుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారనే టాక్ నడుస్తోంది. తన నిర్ణయంతో చంద్రబాబుకు.. జగన్ పరోక్షంగా ఝలక్ ఇచ్చారు. ముందస్తు అంటూ టీడీపీ అధినేత చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు.

ఇదేం ఖర్మ అంటూ రాష్ట్రం అంతా పర్యటిస్తున్న చంద్రబాబు.. వెళ్లిన ప్రతీచోట ముందస్తు గురించే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. అంతా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. ఐతే ఇప్పుడు జగన్ పరోక్షంగా ఇచ్చిన సంకేతాలతో టీడీపీకి, చంద్రబాబుకు ఒకరకంగా ఝలక్‌ అనే చర్చ జరుగుతోంది.