Jagan Strategy: 2024లో 40 మంది సిట్టింగ్‌లు ఔట్.. జగన్ నిర్ణయం తీసేసుకున్నారా ?

వైసీపీ విజయం మరోసారి ఖాయం అని అంతా అనుకుంటుంటే.. మూడు నెలల్లో సీన్ మారిపోయింది. టీడీపీ ఒక్కసారిగా దూసుకువచ్చింది. పొలిటికల్ అటెన్షన్ డ్రా చేసింది. దీంతో జగన్ మరింత అప్రమత్తం అయ్యారు.

  • Written By:
  • Publish Date - February 24, 2023 / 12:29 PM IST

వైనాట్ 175 నినాదంతో దూసుకుపోతున్న జగన్.. 2024లో ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అన్నీ తానై.. అన్నింటికి తానై అన్నట్లుగా పార్టీని ముందుకు నడిస్తున్నారు. వైసీపీ విజయం మరోసారి ఖాయం అని అంతా అనుకుంటుంటే.. మూడు నెలల్లో సీన్ మారిపోయింది. టీడీపీ ఒక్కసారిగా దూసుకువచ్చింది. పొలిటికల్ అటెన్షన్ డ్రా చేసింది. దీంతో జగన్ మరింత అప్రమత్తం అయ్యారు. ప్రత్యర్థికి ఏ చిన్న అవకాశం ఇవ్వొద్దని ఫిక్స్ అయ్యారు. దానికోసం ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధం అన్నట్లుగా కనిపిస్తున్నారు.

ఇప్పటికే 27మంది సిట్టింగ్ లకు వార్నింగ్ ఇచ్చిన జగన్.. ప్రతీ ఎమ్మెల్యే పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్నారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్టు కూడా తెప్పించుకుంటున్నారు. ఈ నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. నిజానికి పార్టీలో ఉన్న అంసతృప్తులు, గ్రూప్ వార్ అంతా ఇంతా కాదు.. దాదాపు ప్రతీ జిల్లాలోనూ ఇలాంటి తలనొప్పే వేధిస్తోంది వైసీపీని ! అసంతృప్తులకు కారణాలు తెలుసుకుంటూనే.. ఎమ్మెల్యేల గురించి జనాలు ఏమనుకుంటున్నారనే విషయాలపై జగన్ కన్నేశారు. దాదాపు 40 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జనాలు గుర్రుగా ఉన్నారని.. వాళ్లను మార్చకపోతే.. పార్టీకి పెద్ద దెబ్బ ఖాయం అని జగన్ కు ఇంటలిజెన్స్ నుంచి నివేదిక అందినట్లు టాక్.

గడపగడపకు కార్యక్రమంలోనూ వారికి ప్రతీచోట నిరసనలే ఎదురయ్యాయని.. అలాంటి వారిపై జగన్ గురి పెట్టారని తెలుస్తోంది. దీంతో ఆ 40మందిని పక్కపెట్టేందుకు కూడా సిద్ధం అయ్యారనే చర్చ జరుగుతోంది. ఈ ఒక్కసారి అధికారం దక్కితే.. మరో 30 ఏళ్ల వరకు ఎదురు ఉండదు అని జగన్ ప్లాన్. రాజకీయం చూస్తే అదే నిజం అనిపిస్తోంది కూడా ! దీంతో 40మంది విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా జగన్ కనిపిస్తున్నారు. నొప్పించినా.. ఇబ్బంది పెట్టినా.. అంతిమంగా కావాల్సింది విజయం.. దానికోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు సిద్ధం అన్నట్లుగా జగన్ నిర్ణయాలు కనిపిస్తున్నాయ్. దీంతో ఆ 40మంది ఎవరు అనే దాని మీద ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోంది.

ఉమ్మడి గోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని మూడు జిల్లాల్లోనూ ఈ నంబర్ ఎక్కువగా కనిపించే చాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. ఐతే జగన్ అంటున్నట్లు క్లీన్ స్వీప్ తర్వాత సంగతి.. ఇప్పుడు టీడీపీ జోరుతో తిరిగి అధికారంలోకి రావడం కూడా కష్టంగా మారిందన్నది మరికొందరి టాక్. ఏమైనా.. ఆ 40మంది సిట్టింగ్ లు ఎవరు అన్నది ఇప్పుడు వైసీపీతో పాటు రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది.