జగన్ కు పాస్పోర్ట్ కష్టమేనా…?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాస్పోర్టుపై హైకోర్టులో విచారణ ముగిసింది. శుక్రవారం ఏపి హై కోర్టు లో జగన్ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఐదేళ్ల కు పాస్పోర్ట్ రెన్యువల్ ఇవ్వాలంటు పిటిషన్ దాఖలు చేసారు.

  • Written By:
  • Publish Date - September 9, 2024 / 05:05 PM IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాస్పోర్టుపై హైకోర్టులో విచారణ ముగిసింది. శుక్రవారం ఏపి హై కోర్టు లో జగన్ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఐదేళ్ల కు పాస్పోర్ట్ రెన్యువల్ ఇవ్వాలంటు పిటిషన్ దాఖలు చేసారు. విజయవాడ కోర్ట్ ఏడాదికి మాత్రమే అనుమతి ఇస్తూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి పాస్పోర్టు ఉందో అదే పాస్పోర్ట్ కావాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు జగన్.

ప్రజా ప్రతినిధులు కోర్టు ఇచ్చిన తీర్పునే హైకోర్టు కొనసాగిస్తుందని న్యాయానిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రస్తుతం బెంగళూరు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈనెల మూడో తేదీనే లండన్ వెళ్ళాల్సి ఉంది. పాస్పోర్ట్ విషయంలో వాయిదా పడటంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనితోనే లండన్ టూర్ వాయిదా పడింది. ఈ నెల 11 న తీర్పు ఇవ్వనుంది కోర్ట్.