GUDIVADA YCP : నానికి షాకిచ్చిన జగన్.. కాపుల ఓట్ల భయంతోనే సీటు నిరాకరణ

ఏపీలో వైసీపీ (YCP) నియోజకవర్గాల మార్పుల చేర్పుల్లో గుడివాడలో (Gudivada) కొడాలి నానికి షాక్ ఇచ్చారు సీఎం జగన్. ఆయన్ని గుడివాడ నియోజకవర్గం నుంచి తప్పించబోతున్నారు. అక్కడ మండల హనుమంతరావుకి టిక్కెట్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి టౌన్ లో రాత్రికి రాత్రి వెలిసిన ఫ్లెక్సీల కలకలం సృష్టించాయి. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న మండల హనుమంత రావుకు శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దాంతో కొడాలి నాని అభిమానులు షాక్ తిన్నారు.

ఏపీలో వైసీపీ (YCP) నియోజకవర్గాల మార్పుల చేర్పుల్లో గుడివాడలో (Gudivada) కొడాలి నానికి షాక్ ఇచ్చారు సీఎం జగన్. ఆయన్ని గుడివాడ నియోజకవర్గం నుంచి తప్పించబోతున్నారు. అక్కడ మండల హనుమంతరావుకి టిక్కెట్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి టౌన్ లో రాత్రికి రాత్రి వెలిసిన ఫ్లెక్సీల కలకలం సృష్టించాయి. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న మండల హనుమంత రావుకు శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దాంతో కొడాలి నాని అభిమానులు షాక్ తిన్నారు.

నియోజకవర్గాల మార్పుల్లో కొడాలి నాని (Kodali Nani) కూడా ప్లేస్ మారాల్సి వచ్చింది. ప్రస్తుతం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్న హనుమంత రావుకు గుడివాడ ఎమ్మెల్యే టిక్కెట్ ను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. గుడివాడలో హనుమంతరావు పేరుతో ఫ్లెక్సీలు వెలియడంతో స్థానికంగా చర్చ జరుగుతోంది. వైయస్సార్, జగన్ (CM Jagan), రంగా ఫోటోలతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయన వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు. ఇప్పటికే హనుమంతరావుకి సీఎం క్యాంపాఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు అనుచరులు చెబుతున్నారు. అయితే కాపు వర్గం సమీకరణాల్లో భాగంగానే నానికి గుడివాడ టిక్కెట్ ను జగన్ నిరాకరించినట్టు తెలుస్తోంది.

కొడాలి నానిని గన్నవరం నియోజకవర్గానికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలని జగన్ ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. దాంతో నాని గన్నవరంలో తన క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గం గతంలో టీడీపీకి కంచుకోటగా ఉంది. కొడాలి నాని YCP లోకి మారిన తర్వాత అక్కడి పరస్థితులు మారిపోయాయి. 2004, 2009లో టీడీపీ నుంచి కొడాలి నాని గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల కంటే ముందే వైసీపీలోకి వెళ్ళారు. తర్వాత 2019లోనూ టీడీపీ (TDP) ఓడిపోయింది. నాని విజయం సాధించారు.
టీడీపీకి బలమైన గుడివాడ స్థానాన్ని వైసీపీకి టర్న్ చేసిన కొడాలి నానికి తిరిగి టిక్కెట్ ఇవ్వకపోవడానికి బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ అడప బాబ్జి అనే కాపు నేతకు వైసీపీలో సీటు ఇప్పిస్తానని కొడాలి నాని హామీ ఇచ్చారు. కానీ అది వర్కవుట్ కాలేదు. దాంతో అడప బాబ్జి మనస్థాపం చెందారు. ఆ తర్వాత గుండెపోటుతో చనిపోయారు. నాని చేసిన ద్రోహం వల్లే బాబ్జి చనిపోయాడని గుడివాడలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.

కాపుల్లో ఉన్న ఈ వ్యతిరేకత … ఎన్నికల నాటికి ఇంకా తీవ్రం అవుతుందని జగన్ భయపడ్డారు. అందుకే స్థానిక కాపు నేత అయిన మండలి హనుమంతరావుకి గుడివాడ టిక్కెట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 10 వేల ఓట్లు ఉన్నాయి. వీటిల్లో 40 వేల ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారివే. రెండో స్థానంలో ఎస్సీ వర్గం ఓట్లు ఉన్నాయి. మండలి హనుమంతరావుకి గుడివాడ జనంలో మంచి పేరుంది. కార్యకర్తలతో కలసిపోతాడని చెబుతారు. దాంతో నానికి బదులు హనుమంతరావుకు గుడివాడ టిక్కెట్ కన్ఫమ్ చేసినట్టు సమాచారం. కొడాలి నానిని గన్నవరంకు షిప్ట్ చేశారని చెబుతున్నారు.