AP 2024 General Elections : వారసులకు జగన్ గ్రీన్‌సిగ్నల్‌.. వ్యూహం వర్కౌట్ అయ్యేనా..

సరిగ్గా ఏడాది కిందటి మాట.. గడపగడపకు ప్రభుత్వం పేరుతో ఓ కార్యక్రమం మొదలుపెట్టారు జగన్‌. మూడు నెలల తర్వాత ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్‌పై సర్వేలు తెప్పించుకున్నారు. అప్పుడు మొదలైంది వైసీపీ నేతల్లో టెన్షన్‌. సర్వేలో తేడా రిపోర్ట్ వస్తే పక్కన పెడతానని ఆనాడు చెప్పిన జగన్‌.. ఇప్పుడు గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాలకు ఇంచార్జిలను మారుస్తున్నారు. ఐతే ఆనాడు వారసులకు అవకాశం లేదని చెప్పిన జగన్‌..

సరిగ్గా ఏడాది కిందటి మాట.. గడపగడపకు ప్రభుత్వం పేరుతో ఓ కార్యక్రమం మొదలుపెట్టారు జగన్‌. మూడు నెలల తర్వాత ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్‌పై సర్వేలు తెప్పించుకున్నారు. అప్పుడు మొదలైంది వైసీపీ నేతల్లో టెన్షన్‌. సర్వేలో తేడా రిపోర్ట్ వస్తే పక్కన పెడతానని ఆనాడు చెప్పిన జగన్‌.. ఇప్పుడు గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాలకు ఇంచార్జిలను మారుస్తున్నారు. ఐతే ఆనాడు వారసులకు అవకాశం లేదని చెప్పిన జగన్‌.. ఇప్పుడు ఆ మాటను పక్కన పెట్టారు. నియోజకవర్గాల ఇంచార్జిల సెకండ్‌ లిస్ట్ చూస్తే అదే అర్థం అవుతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య.. అభ్యర్థులను మారిస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుందనే అంచనాతో జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా చోట్ల సిట్టింగ్‌లకు షాక్ ఇన్ చార్జులు. వారసులకు న్యాయం చేస్తూ కొన్నిచోట్ల వ్యూహాత్మక అడుగులు వేశారు.

తెలంగాణ ఫలితాలు నేర్పిన పాఠమో.. యువనేతలపై నమ్మకమో.. ఇంచార్జిల మార్పు విషయంలో వారసులకు పెద్దపీట వేశారు జగన్‌. రెండో జాబితాలో ఏకంగా నలుగురు వారసులకు చోటిచ్చారు. తిరుపతి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి.. చంద్రగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి.. మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి.. రామచంద్రాపురం నుంచి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాశ్‌కి టికెట్లు ఖరారు చేశారు. ఆయా స్థానాలకు వారిని ఇంచార్జిలుగా ప్రకటించారు. నిజానికి కొత్త లిస్ట్ అనౌన్స్‌ చేస్తున్నారు అంటే.. కచ్చితంగా సంచలనాలు ఉంటాయని అంతా అనుకున్నారు. దానికి తగినట్లుగానే.. సిట్టింగ్‌లకు చాలాచోట్ల నో టికెట్ అనేశారు జగన్‌. ఐతే వారసులకు అవకాశమిస్తూ సీనియర్ నేతలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు జగన్‌. నిజానికి వారసులకు టికెట్ ఇచ్చేది లేదని..

గతంలో చాలాసార్లు జగన్ చెప్పారు. పేర్ని నాని కూడా చాలా సందర్భాల్లో మచిలీపట్నం టికెట్‌పై కామెంట్‌ చేశారు. తన కొడుక్కి టికెట్ అడిగినా జగన్ వారించారని, తననే పోటీ చేయమంటున్నారని చెప్పుకొచ్చారు. ఐతే ఇప్పుడు జగన్ వ్యూహం మారింది. దీనికి కారణం తెలియదు కానీ.. వారసులకు ఈసారి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే రెండో లిస్ట్ లో నలుగురు యువనేతలకు చోటు లభించింది. వీరంతా ఇప్పటికే జనంలోకి వెళ్లారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే తండ్రికి తగ్గ తనయులుగా ఆయా నియోజకవర్గాల్లో విజయం సాధించి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెడతారా లేదా అనేది తేలాల్సి ఉంది.