Prashanth varma : ఉగాది రోజున జై హ‌నుమాన్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..?

సంక్రాంతి (Sankranti) బ‌రిలో చిన్న సినిమాగా విడుద‌లైన హ‌నుమాన్ ఎంత‌టి ప్ర‌భంజ‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందో.. ఈ సినిమాతో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది.

సంక్రాంతి (Sankranti) బ‌రిలో చిన్న సినిమాగా విడుద‌లైన హ‌నుమాన్ ఎంత‌టి ప్ర‌భంజ‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందో.. ఈ సినిమాతో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ‘హ‌నుమాన్’ (Jai Hanuman) తో పాన్ ఇండియా (Pan India) క్రేజ్ సంపాదించుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. దీంతో.. త‌న నెక్స్ట్ మూవీస్ ఎప్పుడెప్పుడా అని ఆడియ‌న్స్ ఎంతో యాంగ్జైటిగా ఎదురు చూస్తున్నారు. ఈ లిస్టులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో చేస్తున్న ఓ ఎక్స్‌ప‌ర‌మెంటల్ మూవీ ఒక‌టి కాగా.. రెండోది హ‌నుమాన్‌కు సీక్వెల్‌గా వ‌స్తున్న జై హ‌నుమాన్ మూవీ.. ఇక‌.. జై హ‌నుమాన్ మూవీపై అయితే ఇప్ప‌టి నుంచే హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో ప్ర‌శాంత్ వ‌ర్మ పెట్టిన ఓ స‌స్పెన్స్ సోష్‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

జై హ‌నుమాన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఉగాది వ‌స్తుంది అంటూ ఓ పోస్ట్ పెట్టి ఏదో బ‌లంగా కోరుకుంటున్నట్లుగా ఓ ఎమోజీ పెట్టాడు. ఇది ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. ప్ర‌శాంత్ వ‌ర్మ దేని కోసం ఈ పోస్ట్ పెట్టాడంటూ నెటిజ‌న్లు డిస్క‌ష‌న్ పెడుతున్నారు. ఇది తన కొత్త సినిమా కోసమా లేక “జై హనుమాన్” కోసమా అన్న‌ది ఇప్పుడు పెద్ద క్వ‌శ్ఛ‌న్‌గా మారింది.

నిజానికి ‘హ‌నుమాన్‌’ కంటే.. ప‌దింత‌లు క్రేజీగా, భారీగా ‘జై హ‌నుమాన్‌’ తీయాల‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ భావిస్తున్నాడు. మ‌రోవైపు ‘హ‌నుమాన్‌’ పాత్ర చేయ‌డానికి చాలామంది స్టార్ హీరోలు సైతం ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇక‌.. కొన్ని రోజులు కితమే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ఫస్ట్ లుక్ అతి త్వరలోనే రాబోతుంది అని ప్రామిస్ చేసాడు. దీంతో.. చాలా మంది ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ పోస్ట్ జై హ‌నుమాన్‌కు సంబంధించి పెట్టిందే అని భావిస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ నుంచి ఈ తెలుగు కొత్త సంవత్సరాదికి ఎలాంటి అప్డేట్ రానుందో వేచి చూడాలి.