DOCTORS NEGLIGANCE : డాక్టర్లకు జైలు శిక్ష.. నిర్లక్ష్య వైద్యం తో డాక్టర్లకు శిక్ష..

నిర్లక్ష్యంగా వైద్యం చేసి ఓ పేషెంట్ మరణానికి కారణమైతే డాక్టర్లకీ శిక్షలు తప్పవు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టిన భారతీయ న్యాయసంహిత బిల్లు 2023లో ఈ ప్రొవిజన్ ఉంది. అయితే గతంలో ఉన్న ఐదేళ్ళ శిక్షా కాలానికి బదులు రెండేళ్ళకు తగ్గించారు. పేషెంట్ కు వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది.

బ్రిటీష్ కాలం నాటి యాక్ట్స్ స్థానంలో కొత్త భారతీయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇందులో భారతీయ న్యాయ సంహితలో 106 of 1 సెక్షన్ కింద నిర్లక్ష్యంగా వైద్యం చేసిన డాక్టర్లకు శిక్షను ప్రతిపాదించారు. పేషెంట్ మరణానికి కారణమైతే ఆ డాక్టర్ కు రెండేళ్ళ దాకా శిక్ష పడుతుంది. జరిమానా కూడా విధించే ఛాన్సుంది. రిజిస్టర్డ్ అయిన మెడికల్ ప్రాక్టీషనర్ అయితే రెండేళ్ళ జైలు, జరిమానా విధించవచ్చు. ప్రస్తుతం ఉన్న IPC 304A ప్రకారం నిర్లక్ష్యంగా వైద్యం చేసిన డాక్టర్లకు రెండేళ్ళ జైలు, జరిమానా విధించే ఛాన్సుంది. అయితే నిర్లక్ష్యంగా వైద్యం చేయడం వేరు.. యాక్సిండెంట్ కేసులు వేరు.. గతంలో డాక్టర్ల విషయంలో ఈ రెండింటినీ కలిపి చూసేవారు. కానీ ఇప్పుడు నిర్లక్ష్య వైద్యం అనే కాజ్ పైనే రెండేళ్ళ దాకా శిక్ష పడుతుంది. తమ అభ్యర్థనను కేంద్రం మన్నించినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.

డాక్టర్లపై గతంలో లాగా ఎలా పడితే అలా.. ప్రైవేట్ కంప్లయింట్స్ తో కేసులు బుక్ చేయడానికి పోలీసులు లేదా ఇన్వెస్టిగేషన్ అధికారికి అవకాశం లేదు. నిజంగా ఆ డాక్టర్ నిర్లక్ష్యంగానే వైద్యం చేశాడా లేదా అన్నది ఓ క్వాలిఫైడ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి మెడికల్ ఒపీనియన్ తీసుకున్నాకే ఆ డాక్టర్ మీద కేసు బుక్ చేయాలి. అంటే గతంలో కంటే ఇప్పుడు BNS లో డాక్టర్లకు అదనపు ప్రొటెక్షన్ లభించినట్టయింది. నిర్లక్ష్యంగా వైద్యం చేశాడని కేసు పెట్టడం.. ఆ డాక్టర్ ని వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు లేవు. నిజంగా అలాగే ట్రీట్మెంట్ చేసినట్టు ఒపీనియన్ ద్వారా నిర్ధారణ అయితేనే అరెస్ట్, శిక్ష పడటానికి ఛాన్సుంది. ఈ విషయంలో IMA చేసిన లాబీయింగ్ ఫలించిందనే చెప్పుకోవాలి.