SS Rajamouli Modern Masters : జక్కన్న బయోపిక్.. రాజమౌళిపై డాక్యుమెంటరీ

దర్శకత్వ కెరియర్‌లో పరాజయం చవిచూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే అది రాజమౌళి అనే చెప్పవచ్చు. బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాల వైపు దేశమంతా చూసింది.

దర్శకత్వ కెరియర్‌లో పరాజయం చవిచూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే అది రాజమౌళి అనే చెప్పవచ్చు. బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాల వైపు దేశమంతా చూసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో టాలీవుడ్‌ ఖ్యాతిని ప్రపంచం అంతా చాటారు రాజమౌళి. అలాంటి వ్యక్తి జీవిత విశేషాలతో కూడి ఓ డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. దాని పేరే మోడ్రన్‌ మాస్టర్స్‌. జక్కన్నగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నా రాజమౌళి వందల కోట్ల బడ్జెట్‌తో సినిమానూ తీయగలరు. వేల కోట్ల వసూళ్లనూ సాధించగలరు. అంతటి సక్సస్‌ ఫార్ములా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

ఇలాంటి రాజమౌళి దర్శక జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ మోడ్రన్ మాస్టర్స్‌ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. అయితే ఇది బయో పిక్‌ ఆఆ? లేకపోతే సినిమా అచీమ్‌మెంట్స్‌ మాత్రమే ఉంటాయా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా నెట్‌ ఫిక్స్‌ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

జాతీయ, అంతర్జాతీయ పరంగా రాజమౌళి ప్రాబల్యం ఎలా వ్యాపించిందన్న విషయం ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టనున్నారు. హాలీవుడ్‌ అగ్ర దర్శకులైన జేమ్స్‌ కామెరూన్‌, జో రూసోలాంటి వారు రాజమౌళిపై తమ అభిప్రాయాలను తెలిపారు. అలాగే ప్రభాస్‌, రాణా, జూనియర్‌ ఎన్టీఆర్‌ లాంటి వారూ ఆయనపై వారి వ్యూని చెప్పారట. మరి ఆ వివరాలన్నింటినీ మనం ఓటీటీలో చూడాల్సిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజమౌళి ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రాన్ని మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.