JANASENA: జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు జనసేనదే..

ఎన్నికల సంఘం అనుమతి లేకుండా గాజుగ్లాస్‌ను జనసేన ప్రమోట్‌ చేసుకుందని.. ఆ గుర్తును జనసేనకు కేటాయించవద్దని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆ గుర్తు జనసేనకు దక్కుతుందా లేదా అనే విషయంలో పార్టీ నేతల్లో కూడా డైలమా ఏర్పడింది.

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 08:39 PM IST

JANASENA: ఏపీలో జనసేన పార్టీ గుర్తు విషయంలో కొన్ని రోజుల నుంచి డైలమా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్‌ గుర్తు మీద పోటీ చేసింది. కానీ ఎన్నికల సంఘం రూల్స్‌ కంటే తక్కువ ఓటింగ్‌ రావడంతో గాజుగ్లాస్‌ గుర్తును ఫ్రీ గుర్తుల జాబితాలో పెట్టింది. దీంతో జనసేనకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. కానీ రీసెంట్‌గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పార్టీ నేతల విన్నపంతో మరోసారి గాజుగ్లాస్‌ గుర్తును కేటాయించారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.

Pawan Kalyan: జనసేనలోకి భారీగా చేరికలు.. కీలక నేతల రాకతో బలం పెరుగుతుందా..?

దీంతో తెలంగాణ ఎన్నికలకు కూడా జనసేన పార్టీ.. గాజు గ్లాస్‌ గుర్తుతోనే వెళ్లింది. ఎన్నికలు పూర్తైనప్పటికీ గ్లాస్‌ గుర్తు మాత్రం ఇంకా ఫ్రీ గుర్తుల జాబితాలోనే ఉంది. దీంతో ఆ గుర్తును తమకు శాశ్వతంగా కేటాయించాలంటూ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇదే సయంలో అధికార వైసీపీ నేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా గాజుగ్లాస్‌ను జనసేన ప్రమోట్‌ చేసుకుందని.. ఆ గుర్తును జనసేనకు కేటాయించవద్దని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆ గుర్తు జనసేనకు దక్కుతుందా లేదా అనే విషయంలో పార్టీ నేతల్లో కూడా డైలమా ఏర్పడింది. అయితే ఈ సస్పెన్స్‌కు ఎట్టకేలకు ఎండ్‌ కార్డ్‌ వేశారు ఎన్నికల సంఘం అధికారులు. జనసేన పార్టీకి వచ్చే ఎన్నికల్లో గాజుగ్లాస్‌ను కేటాయిస్తూ నోటీస్‌ రిలీజ్‌ చేశారు. ఈ విషయాన్ని ఈ మెయిల్ ద్వారా జనసేన పార్టీకి కన్ఫాం చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గాజుగ్లాస్‌ గుర్తుతోనే జనసేన పార్టీ ఎన్నికలకు వెళ్లబోతోంది.

జనసేన పార్టీ అంటే గాజుగ్లాస్‌ గుర్తు అని ఇప్పటకే ఆ పార్టీ గ్రామ గ్రామాన ప్రచారం చేసుకుంది. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఆ గుర్తును ఫ్రీ గుర్తుల జాబితాలో చేర్చడంతో పార్టీకి పెద్ద షాక్ తగలింది. ఇదే అదునుగా గ్లాస్‌ గుర్తును పార్టీకి దూరం చేసేందుకు జనసేన ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నించాయి. కానీ ఫైనల్‌గా గాజుగ్లాస్‌ గుర్తును దక్కించుకుంది జనసేన పార్టీ. అదే గుర్తుతో ఎన్నికలకు వెళ్లబోతోంది. ఎన్నికల సంఘం రిలీజ్‌ చేసిన ఉత్తర్వుల కాపీని.. జనసేన లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ పవన్‌ కళ్యాణ్‌కు అందించారు. తమకు గాజుగ్లాస్‌ గుర్తును కేటాయించిన ఎన్నికల అధికారులకు పవన్‌ కళ్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తమ గుర్తు తమకు దక్కడంతో జనసైకులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.