Mudragada Padmanabham: 2009 ఎన్నికల తర్వాత పొలిటికల్ స్క్రీన్ మీద విరామం ప్రకటించారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. తిరిగి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తెగ ఆరాటపడుతున్నారాయన. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన ఫ్యాన్ పార్టీలోకి చేరడం ఖాయమన్న చర్చ జరుగుతూనే ఉంది. కానీ.. కారణాలు చెప్పకుండానే ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి దూరమైపోయారాయన. జనసేనలో చేరాతారనీ.. పవన్ కల్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికెళ్ళి పార్టీలోకి పిలుస్తారని టాక్ కూడా నడిచింది. కానీ పవన్ వెళ్ళలేదు. ముద్రగడను పిలవనూ లేదు. ఏం జరిగింది.. ముద్రగడను తీసుకోడానికి పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి..?
PAWAN KALYAN: అంత మాట అనేశాడే ! పవన్‌పై టీడీపీ గరంగరం.. బతిమలాడుకుంటున్న బాబు
గతంలో టిడిపి, కాంగ్రెస్, జనతా పార్టీల్లో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ముద్రగడ పద్మానాభంది. అయితే ప్రత్తిపాడులో ఓటమి తర్వాత ఇక జీవితంలో ఆ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రంలో కనిపించబోనంటూ శపథం చేసేశారు మాజీ మంత్రి. అందుకు తగ్గట్లుగానే 2009లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్స్ కోసం ఉద్యమాలు చేసిన ముద్రగడకు.. ఇప్పుడు వైసీపీతో గ్యాప్ వచ్చాక జనసేన నేతలు టచ్‌లోకి వెళ్లారు. ఆ పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా ముద్రగడ నివాసానికి రెండుసార్లు వెళ్ళారు. పవన్ వచ్చి ఆహ్వానిస్తే చూద్దామని ఆయన్ని పంపేశారు ముద్రగడ. దీంతో నెల రోజుల నుంచి ఆ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. మొదట్లో ఉద్యమ నేత నివాసానికి క్యూ కట్టిన జనసేన నేతలు తర్వాత పార్టీ లైన్‌తో అటువైపు వెళ్ళడమే మానేశారట. ముద్రగడ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఆచితూచి స్పందిస్తున్నట్టు తెలిసింది. ఆయన పార్టీలో జాయిన్ అయితే మిగతా సామాజిక వర్గాల్లో ఏ మేరకు ఎఫెక్ట్ ఉంటుందని ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
BRS PLAN: నీళ్లతోనే కాంగ్రెస్‌ని కొట్టాలి.. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేలా బీఆర్ఎస్ ప్లాన్
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గంలో మెజార్టీ ఓట్ షేరింగ్ మన వైపే ఉంటుందని, అలాంటప్పుడు పద్మనాభం వల్ల వచ్చే అదనపు లాభమేంటని కూడా ఆరా తీస్తున్నారట జనసేన ముఖ్యులు. అటు పద్మనాభం కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని పట్టుదలగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. పార్టీ ఏదైనా తనతోపాటు కుమారుడికి కూడా టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాలతో అది సాధ్యమా అన్న క్వశ్చన్ వస్తోంది రాజకీయ వర్గాల్లో. టిడిపి, జనసేన కూటమిలో బిజెపి చేరడం దాదాపు ఖాయమైనట్టే. మరో వారం పది రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుంది. మూడు పార్టీల పొత్తులో ముఖ్య నేతల సీట్లే గల్లంతు అవుతున్న పరిస్థితుల్లో.. ఒకే ఫ్యామిలీకి రెండు సీట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చంటున్నారు. ఆ లెక్కలకు అనుగుణంగానే.. ముద్రగడ నివాసానికి పవన్ వెళ్లలేదన్న చర్చ జరుగుతోంది. అంతకుముందు వైజాగ్‌లో పార్టీ నేత కొణతాల రామకృష్ణ, తాజాగా భీమవరంలో టిడిపి నేత ఇంటికి కూడా వెళ్లిన పవన్.. ముద్రగడను కలవకపోవడానికి డబుల్ టిక్కెట్ ట్రబులే కారణమా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ముద్రగడ దగ్గరికి వెళ్లినా.. ఆయన ప్రస్తావించే అంశాలకు తగ్గట్టు కమిటెడ్‌గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కాబట్టి పవన్ కూడా వెయిట్ అండ్ సీ ఫార్ములా అప్లై చేస్తున్నారట. మరోవైపు టీడీపీ నుంచి కూడా ముద్రగడ చేరిక వల్ల కూటమికి ఒనగూరే ప్రయోజనం ఎంత? జరిగే డ్యామేజ్ ఎంతన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని క్లారిటీకి రమ్మంటూ వర్తమానం అందినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లోనే పవన్ వస్తే మంచిది.. రాకపోతే మరీ మంచిదని పద్మనాభం కామెంట్ చేసినట్టు తెలిసింది. మొత్తానికి ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ అన్నది మాత్రం అంత ఈజీగా లేదన్నది రాజకీయవర్గాల మాట. వైసీపీతో చెడింది, టీడీపీ-జనసేన కూటమి ఆచితూచి వ్యవహరిస్తున్న టైంలో మాజీ మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలంటున్నారు పరిశీలకులు.