చిత్తూరు జిల్లా పూతలపట్టులో జనసేన నాయకుడు ఒకరు చేసిన నిరసన హాట్ టాపిక్ అయింది. కాణిపాకం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో జనసేన నాయకుడు రాజ్ కుమార్ నిరసన తెలిపారు. కాణిపాకం హై స్కూల్ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరిగాయని నిరసన చేసారు ఆయన. సర్వేనెంబర్ 362 నందు కాణిపాకం ఆలయ మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఇప్పటికే హైకోర్టును జనసేన నాయకుడు రాజ్ కుమార్ ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన కోర్ట్ హైకోర్టు డబ్ల్యు పి నంబర్ 16 466/2024 కేసు పై మద్యంతర ఉత్తరులు ఇచ్చింది.
ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాణిపాకం పంచాయతీ సెక్రెటరీ, ఐరాల ఎమ్మార్వో లు అక్రమ నిర్మాణాలకు సహకరించారని రాజ్ కుమార్ ఆరోపించారు. పెట్రోల్ బాటిల్ తో పంచాయతీ కార్యాలయం లోపలి వెళ్లి తాళాలు వేసుకున్నారు రాజ్ కుమార్. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసాడు. ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలన్న డిమాండ్ తో నిరసనను రాజ్ కుమార్ కొనసాగిస్తున్నారు.