ఈ వివాదంలో అంబటే స్వయంగా ఎంటర్ అయ్యారు. పవన్ మీద, బ్రో మూవీ మీద విమర్శలు గుప్పించారు. బ్రో మూవీ ఒక అట్టర్‌ఫ్లాప్ సినిమా అని.. పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన వసూళ్లు ఎన్ని.. బయటపెట్టండి చూద్దాం అంటూ పవన్ మీద స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. బ్లాక్ మనీని వైట్‌గా మార్చి.. బ్రో మూవీ తీశారని.. దీని మీద ఈడీకి కంప్లైంట్ చేసేందుకు ఢిల్లీ వరకు వెళ్లారు. అంబటి ఈ విషయంలో సీరియస్‌గా ఉంటే.. జనసైనికులు కూడా తగ్గేదే లే అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అంబటిని, వైసీపీని ఆడుకుంటున్నారు.
జనసేన అధికారిక ట్విట్టర్‌లో.. అంబటి ఫొటో హైలైట్ చేస్తూ ఓ కార్టూన్ పోస్ట్ చేశారు. భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయిందని.. ఐతే ప్రభుత్వం నుంచి అరకొర సాయమే అందిందని ఆ కార్టూన్ కింద రాసుకొచ్చారు. బ్రో మూవీ మీ రివ్యూలు, ట్వీట్లు తర్వాత చేద్దురు కానీ.. ముందు మా సంగతి చూడండి బాబు అంటూ.. వరద చుట్టుముట్టిన ఇంటి మీద భార్యభర్తలు నిలబడుతూ ప్రాధేయపడినట్లు ఆ కార్టూన్ డిజైన్ చేసి.. అంబటి మీద సెటైర్లు గుప్పించారు. ఇవన్నీ చూస్తే.. బ్రో మూవీ వివాదం ఇప్పట్లో కూల్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎంత దూరం అయినా ఢీకొట్టేందుకు రెడీ అన్నట్లుగా జనసైనికులు కనిపిస్తున్నారు. బ్రో యుద్ధంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో మరి.