Janasena: రోడ్డెక్కబోతున్న వారాహి.. ఇక దబడి దిబిడే..

జనసేన ప్రచార రథం వారాహి రోడ్డేక్కబోతోంది. త్వరలోనే ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నాడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 03:06 PM IST

ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్‌ వర్క్‌ మొదలు పెట్టారు జనసేన నేతలు. త్వరలోనే ఉభయగోదావరి జిల్లాల జనసేన నేతలతో జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌ తరువాత పవన్‌ ఎలక్షన్‌ క్యాంపెనింగ్‌ రూట్‌మ్యాప్‌ను విడుదల చేయబోతున్నారు. ఎన్నకల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఈ వాహనాన్ని తయారు చేయించుకున్నాడు పవన్‌ కళ్యాణ్‌. జవనరి 24న కొండగట్టులో వారాహికి పూజలు చేయించాడు. ఆ తరువాత విజయవాడ కనకదుర్గ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వారాహి రోడ్డు మీదకు రావడంతో జనసైనికుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. ఈ వాహనం కలర్‌ విషయంలో అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. ఆర్మీ వాహనాలకు ఉపయోగించే కలర్‌ను వారాహి వాడారని.. దాని రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వబోమని ఏపీ మంత్రులు వరుసబెట్టి మరీ మీటింగ్‌లు పెట్టి మరీ చెప్పారు. కానీ అప్పటికే వారాహికి తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ చేయించాడు పవన్‌ కళ్యాణ్. ఈ విషయం తెలియక ఏపీ మంత్రులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

అయితే అప్పటి నుంచి వారాహి షెడ్‌కు మాత్రమే పరిమితమైంది. ఎన్నికల్లో పొత్తుల విషయంలో సస్పెన్స్‌ ఉండటంతో జనసేన ఎన్నికల ప్రచారానికి సిద్ధం కాలేదు. కానీ మరోపక్క ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. క్లారిటీ విషయం తరువాత ముందు ప్రజల్లోకి వెళ్లాలని భావించిన పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. దీంతో జనసైనికులు ఎంతో అభిమానించే వారాహి త్వరలోనే రోడ్డెక్కబోతోంది. ఈ న్యూస్‌ జనసైనికుళ్లో ఫుల్‌ జోష్‌ నింపింది. వారాహి రాకకోసం ఏపీ ఎదురుచూస్తోందంటున్నారు జనసైనికులు.